Advertisement
Google Ads BL

నాగార్జున సోదరి-మేనల్లుడిపై కేసు


అక్కినేని నాగార్జున ప్రస్తుతం సామిరంగా మూవీ తో పాటుగా బిగ్ బాస్ సీజన్ 7 లో హోస్ట్ గా కనబడుతున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున సోదరి నాగ సుశీల, ఆయన మేనల్లుడు సుశాంత్ పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు వీరిపై కేసు ఎవరు పెట్టారంటే.. గతంలో నాగ సుశీలతో కలిసి హీరోగా సుశాంత్ సినిమాలని నిర్మించిన చింతలపూడి శ్రీనివాసరావు ఈ తల్లికొడుకులపై కేసు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. 

Advertisement
CJ Advs

శ్రీనివాసరావు తో కలిసి సుశీల రియల్ ఎస్టేట్ కూడా చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి వీరి మద్యన విభేదాలు రావడం, శ్రీనివాసరావు అక్రమంగా భములు అమ్మేసి ఆ  డబ్బు తీసుకున్నాడని అప్పట్లోనే సుశీలనే శ్రీనివాసరావుపై కేసు పెట్టింది. కానీ ఇప్పుడు అదే శ్రీనివాస్ నాగ సుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. సుశీల ఆమెతో పాటుగా ఇంకొంతమంది తనపై దాడి చేసారంటూ అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

శ్రీనివాసరావు ఓ ట్రస్ట్ కు డొనేట్ చేసిన స్థలం దగ్గరకు సుశీల ఆమె అనుచరులు వచ్చి గొడవ చెయ్యడమే కాకుండా సాక్ష్యాలు లేకుండా చెయ్యడానికి సిసి టీవీ వైర్లు కట్ చేసారని పోలీసులకు నాగసుశీల, అలాగే అమెకొడుకు సుశాంత్ తదితరులపై శ్రీనివాసరావు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. 

Case against Nagarjuna sister Naga Susheela:

Police Case Filed On Nagarjuna Sister Naga Susheela
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs