మెగాస్టార్ ఇంట్లో పూజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి, రామ్ చరణ్ ఎప్పుడు ఏదో ఒక మాల వేసుకుని పూజలు చేస్తారు. అలాగే ప్రతి ఫెస్టివల్ వారింట్లో గొప్పగా జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయకచవితి ఫెస్టివల్ అయితే వారింట్లో ప్రత్యేకంగా జరిగింది. ప్రతి ఇంట్లోనూ జరిగినట్లే మెగాస్టార్ స్టార్ ఇంట్లోనూ వినాయక పూజ జరిగింది. కానీ మెగా ఫ్యామిలిలో ఈ వినాయకచవితికి ఒక ప్రత్యేకత ఉంది.
అది నిన్న ఆదివారం మెగాస్టార్ మనవరాలు క్లింకార మెగాస్టార్ ఇంటికి గృహప్రవేశం చేసింది, అంటే మెగా వారసురాలు మెగాస్టార్ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈరోజు వినాయకచవితి. చవితిని చిరంజీవి తన భార్య సురేఖ, కొడుకు చరణ్-కోడలు ఉపాసన, కుమార్తెలు శ్రీజ, సుష్మితలు ఇంకా మానవరాళ్లతో, ప్రత్యేకంగా చాన్ కుమార్తె క్లింకార తో కలిసి ముచ్చటగా జరుపుకున్నారు.
అలా పూజ చేసిన పిక్స్ తో పాటుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏
ఈ సారి ప్రత్యేకత ... చిన్ని క్లిన్ కారా తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊 అంటూ చిరు హ్యాపీగా ట్వీట్ చేసారు.