Advertisement
Google Ads BL

డైరెక్టర్ vs ప్రొడ్యూసర్: హీరో సైలెంట్


రీసెంట్ గా హీరో విజయ్ దేవరకొండపై సెటేరికల్ ట్వీట్ చేసి ఒక్కసారిగా న్యూస్ లో నిలిచిన డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ విజయ్ ట్వీట్ విషయంలో విమర్శలపాయిన విషయం తెలిసిందే. నిర్మాతలని అడగాల్సింది పోయి హీరోని టార్గెట్ చెయ్యడం ఎంతవరకు సబబు అంటూ అభిషేక్ నామాని అందరూ ఆడేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అభిషేక్ నామ మరో సినిమా విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. 

Advertisement
CJ Advs

అది కళ్యాణ్ రామ్ తో నిర్మస్తున్న డెవిల్ సినిమా విషయంలో నెగెటివ్ వే లో అభిషేక్ నామా పేరు బయటికి వచ్చింది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కుతున్న డెవిల్ సినిమాకు ద‌ర్శ‌కుడు నవీన్ మేడారం అయితే.. కొత్త పోస్టర్లో దర్శకుడిగా అభిషేక్ నామ త‌న పేరే వేసుకుని పోస్ట‌ర్లు రిలీజ్ చేయ‌డ‌మే ఇందుక్కార‌ణం. డెవిల్ సినిమా న‌వీన్ మేడారం డైర‌క్ష‌న్లో మొద‌లైంది. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ మీద రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్‌గా త‌న పేరే ఉంది.. 

కానీ తర్వాత దర్శకుడితో పొసగలేదో ఏమో.. ద‌ర్శ‌కుడిగా నవీన్ పేరు తొల‌గించి అభిషేక్ పిక్చ‌ర్స్ టీమ్ అని వేశారు. ఇప్పుడు తాజాగా వచ్చిన కొత్త పోస్ట‌ర్లో ద‌ర్శ‌కుడిగా అభిషేక్ నామా పేరు ఉండడంతో నవీన్ కి అభిషేక్ నామా కి గొడవైంది అని తేటతెల్లమైంది. దర్శకుడికి-నిర్మాతకు మధ్య ఇంత జరుగుతున్నా హీరో క‌ళ్యాణ్ రామ్ సైలెంట్ గా ఉండడం అందరిని షాక్ కి గురి చేస్తుంది. డెవిల్ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధమైంది.మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో కళ్యాణ్ రామ్ సైలెన్స్ కి కారణమేమిటో కానీ.. పాపం నవీన్ అనాల్సిందే. 

Director vs Producer: Hero Silent:

Abhishek Nama vs Naveen Medaram 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs