Advertisement
Google Ads BL

చంద్రబాబు అరెస్ట్.. ప్లాన్ అంతా మోదీదేనా..!?


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్నారు. ఇది శనివారం నుంచి నడుస్తున్న హాట్ టాపిక్. చంద్రబాబు అరెస్ట్ జరిగిన రోజు వైసీపీ పాత్రే ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ సీన్‌లోకి బీజేపీ మాత్రం రాలేదు. సరే.. జీ 20 అని టీడీపీ నేతలు సరిపెట్టుకున్నారు. ఆదివారంతో జీ20 ముగిసింది. ఆ తరువాత అయినా బీజేపీ పెద్దలు చంద్రబాబు అరెస్ట్ అంశంపై పెదవి విప్పింది లేదు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ పాత్రపై కొత్త కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీ సీఎం భుజంపై నుంచి నేరుగా చంద్రబాబుపైకి గన్ గురి పెట్టింది బీజేపీయేనని టాక్ నడుస్తోంది. 

Advertisement
CJ Advs

మోదీకి తెలిసింది రెండే..

నిజానికి అప్పుడు జీ 20 సమయం. అసలే ప్రధాని మోదీ ఎప్పుడూ మీడియా అటెన్షన్ తనపైనే ఉండేలా చూసుకుంటారు. అయితే అలాంటప్పుడు చంద్రబాబుపైకి గన్ ఎలా గురిపెడతారు? అనే అనుమానం తలెత్తింది. ఆ సమయంలో నేషనల్, ఇంటర్నేషన్ మీడియా ఫోకస్ తనపైనే ఉండాలని కోరుకుంటారు కదా? పాయింటే. కానీ చంద్రబాబు అరెస్ట్ అంశంతో జీ 20 సోదిలో లేకుండా పోతుందని బీజేపీ పెద్దలు కూడా ఊహించి ఉండరని మరో టాక్. ప్రధాని మోదీకి తెలిసింది రెండే రెండు విషయాలు. 1. నయానో భయానో ఓ పార్టీని లొంగదీసుకోవడం.. 2. లొంగరు అనుకుంటే ప్రత్యర్థి పార్టీలను వారిపైకి ఉసిగొల్పి.. కేసుల పేరిట ఉక్కిరి బిక్కిరి చేయడం. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో ఇదే జరిగిందని ఏపీవాసులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఏపీపై ఫోకస్ పెట్టని ఇండియా కూటమి..

మొత్తానికి ఈ వ్యవహారంతో బీజేపీతో టీడీపీకి చెడినట్టే అనడంలో సందేహం లేదు. ఇది ఇప్పుడు ఇండియా కూటమికి ప్లస్ కాబోతోందని మరో ప్రచారం. నిజమే.. శత్రువు.. శత్రువు మనకెప్పుడూ మిత్రుడే. ఇక మున్ముందు చంద్రబాబు అడుగులు.. ఇండియా కూటమి వైపు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇండియా కూటమి సౌత్‌లో స్ట్రాంగ్‌గా ఉంది కానీ లోటంతా ఏపీలోనే ఉంది. ఇక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా బీజేపీకే అండగా నిలిచాయి. దీంతో ఇండియా కూటమి ఏపీ వైపు ఫోకస్ పెట్టలేదు. ఇక తాజా పరిణామాలతో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ బాబును ఆకర్షించడం స్టార్ట్ చేశాయి. బాబు అరెస్ట్‌పై బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలన్నీ ఒక్కొక్కటిగా పెదవి విప్పుతున్నాయి. 

మరోసారి సందిగ్ధం..

తొలుత కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండింగా.. ఆ తరువాత పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఏకంగా ఎలాంటి విచారణ లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమంటూ బహిరంగ ప్రకటనే చేశారు. ఇక ఆపై అఖిలేష్ యాదవ్ సైతం చంద్రబాబుకి మద్దతుగా నిలిచారు. మొత్తానికి చంద్రబాబు.. ఇక మున్ముందు ఇండియా కూటమికి దగ్గరవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే నిన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సందిగ్ధంలో పడేశాయి. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కలిసి వస్తే టీడీపీ.. జనసేన, బీజేపీలతో కలిసి వెళుతుంది. కలిసి రాకుంటే మాత్రం ప్రస్తుతానికి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమికే టీడీపీ సపోర్ట్‌గా నిలుస్తుంది. ఇక చూడాలి.. మున్ముందు ఏం జరగనుందొ చూడాలి మరి.

Chandrababu arrest.. Is the whole plan Modi..!?:

Chandrababu arrest update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs