హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు అనేది ఎప్పుడు బయటికొచ్చినా అది ప్రతిసారి సంచలనం రేపుతూనే ఉంది. ఎప్పడు డ్రగ్స్ కేసు గురించి వినిపించినా దానిలో సినిమాకి సంబందించిన వాళ్ళ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. గతంలో డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు వినిపించడమే కాదు.. ఈడీ విచారణకు కూడానవదీప్ హాజరయ్యాడు. కానీ నాకు ఈ డ్రగ్స్ కేసుకి సంబందం లేదు అంటాడు.
తాజాగా డ్రగ్స్ కేసు మరోసారి హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. ఈ కేసులో కూడా నవదీప్ పేరు వినిపించడమే కాదు.. నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా నార్కోటిక్ పోలీసులు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. హీరో నవదీప్ అతని ఫ్రెండ్ రాంచంద్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తేల్చిన పోలీసులు.. నవదీప్ ఫ్రెండ్ రాంచంద్ ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చెయ్యడంతో.. నవదీప్ పారిపోయాడని.. ప్రస్తుతం అతన్ని ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీస్ లు స్టేట్మెంట్ ఇచ్చారు.
మరోపక్క నవదీప్ తనకి ఈ డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ కొన్ని టివి ఛానల్స్ లో మాట్లాడుతున్నాడు. తాను ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చెయ్యలేదు, తానెక్కడికి పారిపోలేదు, తనకి నార్కోటిక్ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అని నవదీప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.