ఆదిపురుష్ విడుదలకు వారం ముందే అమెరికా వెళ్లి దాదాపు 50 రోజుల పాటు అమెరికాలోనే ఉండిపోయిన ప్రభాస్ ప్రాజెక్ట్ K టైటిల్ లాంచ్ తర్వాత ఇండియాకి వచ్చేసారు. ఆ తర్వాత ప్రభాస్ కల్కి షూటింగ్, అలాగే మారుతీ తో చేస్తున్న సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న ఆయన సలార్ మూవీ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వస్తాడని అనుకున్నారు. సలార్ ప్రమోషన్స్ తో దేశం మొత్తం ప్రభాస్ తిరుగుతారని ఫాన్స్ ఆశపడ్డారు. కానీ ఇప్పుడు సలార్ మూవీ వాయిదా పడింది.
ఇక ప్రభాస్ మరోసారి విదేశీ ప్రయాణం పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ వెకేషన్స్ కోసం రెగ్యులర్ గా వెళ్ళే యూరప్ వెళ్లిపోయారని ఓ 15 రోజుల పాటు ఆయన ఇండియాలో కనబడరని.. మారుతీతో చేస్తున్న మూవీకి సంబంధించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసి మరీ ప్రభాస్ ఈ లాంగ్ బ్రేక్ తీసుకున్నారని చెబుతున్నారు.
మారుతీ ప్రభాస్ తో యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసి.. ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారని, ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ షూట్ జరుగుతోంది అని తెలుస్తోంది. ప్రభాస్ 15 రోజుల గ్యాప్ తర్వాత యూరప్ నుంచి ఇరిగి హైదరాబాద్ కి వచ్చి కల్కి, అలాగే మారుతీ షూటింగ్స్ లో జాయిన్ అవుతారట.