కమల్ హాసన్ మాజీ ప్రేయసి నటి గౌతమి తనకి తన కుమార్తె సుబ్బలక్ష్మికి ప్రాణ హాని ఉంది అంటూ పోలీసులని ఆశ్రయించడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తనకి సంబందించిన కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేసారని అదేమిటి అని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ గౌతమి చెన్నై పోలీస్ కమిషనర్ కి ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది.
గౌతమి మొదటగా ఓ వ్యాపారవేత్తని వివాహం చేసుకోగా.. వారికి సుబ్బలక్ష్మి అనే అమ్మాయి పుట్టిన తర్వాత భార్య భర్తల మద్యన పొరపొచ్చాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గౌతమి కొన్నాళ్ళకి కమల్ చెంత చేరింది. కమల్ హాసన్ తో సహజీవనం సాగించిన గౌతమి 2016 లో కమల్ తోనూ విడిపోయి తన కుమార్తె సుబ్బలక్ష్మితో కలిసి ఉంటుంది.
అయితే కొద్దిరోజులుగా గౌతమి అనారోగ్య సమస్యల్తో ఇబ్బందులు పడుతుంది. అందులో భాగంగానే గౌతమి తన స్థిర చరాస్తులని అమ్మకానికి పెట్టి ఆ బాధ్యతని అలగప్పన్ అనే ఏజెంట్ కి అప్పగించింది. అయితే మగవాడి అండ లేని గౌతమిని మోసం చేసే ప్లాన్ లో ఫోర్జరీ సంతకాలతో గౌతమి స్థలాన్ని తాన స్థలంగా చలామణి చేసుకోవడంతో గౌతమి అదేమిటి అని అడిగితే ఆమెని ఆమె కూతురు సుబ్బలక్ష్మిని చంపేస్తామని బెదిరిస్తున్నట్టుగా గౌతమి ఫిర్యాదులో పేర్కొంది.
అలగప్పన్ ఆగడాల వలన తన కూతురు సుబ్బలక్ష్మి చదువు కూడా డిస్టర్బ్ అవుతుంది అని, 25 కోట్ల స్థలాన్ని అలగప్పన్ నుండి తనకి ఇప్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని గౌతమి పోలీసులని అభ్యర్ధించింది.