Advertisement

రేవంత్.. ఇది వెన్నుపోటుకే వెన్నుపోటు!!


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీభత్సంగా ట్రోల్ అవుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఒక్క ట్వీట్ కానీ.. ఒక ప్రెస్‌మీట్ కానీ పెట్టకపోవడం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమవుతోంది. తెలంగాణ వాసులే ఆయనను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో తాను సైడ్ అయిపోకుండా తప్పుకోవడం.. ఆ తరువాత రేవంత్ కూతురి వివాహంలో సైతం చంద్రబాబు దగ్గరుండి జరిపించిన విషయాలను గుర్తు చేస్తున్నారు. అలాగే తన రాజకీయ గురువుగా చంద్రబాబును పేర్కొన్న విషయాన్ని కూడా నెటిజన్లు రేవంత్‌కు గుర్తు చేస్తున్నారు. 

Advertisement

ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయి.. అంత ఇబ్బందుల్లో ఉంటే రేవంత్ స్పందించరా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. ‘‘అవునే రేవంత్ అన్న.. నువ్వు ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినప్పుడు చంద్రబాబు నీకు మస్తు సపోర్ట్ చేసిండు. నీ బిడ్డ పెండ్లి దగ్గరుండి చేయించిండు కదా. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉంటే నువ్వు సప్పుడు చేస్తల్లేవ్ ఏందే? గురువుకు ఇచ్చే మర్యాద ఇదేనానే? గురువు గారూ.. గురువు గారూ అని గూట్లో పండుడు కరెక్టేనానే? తెల్లారి లేస్తే వాని సంగతి చూస్తా.. వీని సంగతి చూస్తా అంటావ్ గానే.. పక్కపొంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ పొయ్యి.. ఆ జగన్మోహన్ రెడ్డికి పోలీస్ పౌరుషం ఏంటో సూపించుపోరాదే.. నీ బాంచన్’’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి ఇది వెన్నుపోటుకే వెన్నుపోటు అని పలువురు నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ హాట్ టాపిక్ అవుతున్నారు. తెలుగు దేశం పార్టీ వాళ్లు రేవంత్‌ని చాలా వెనుకేసుకుని వచ్చే వారని.. కానీ రేవంత్ మూడు రోజుల నుంచి కనీసం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించింది కూడా లేదని మండిపడుతున్నారు. కనీసం సంఘీభావం కూడా చెప్పలేదేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి దాకా చంద్రబాబును తన రాజకీయ గురువు అని.. హైదరాబాద్‌ను ఉన్నంతంగా తీర్చి దిద్దిన వ్యక్తి అని కొనియాడిన రేవంత్.. ఇప్పుడు ఆయనకు కష్టం వస్తే.. సైలెంట్ అయ్యాడని విమర్శిస్తున్నారు. కానీ రేవంత్‌ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ చంద్రబాబు చెప్పినట్టు చేస్తుంటారంటూ ఈ మధ్య కాలంలో అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సపోర్ట్‌గా ఒక్క ట్వీట్ చేసినా.. లేదంటే మీడియా ఎదుట ఒక్కమాట మాట్లాడినా అధికార పార్టీకి ఓ అస్త్రం ఇచ్చినట్టే. ఈ నేపథ్యంలోనే ఆయన సైలెంట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ రేవంత్ స్పందించకపోవడం పట్ల విమర్శలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు ఎపిసోడ్ రేవంత్‌కి ముందు గొయ్యి.. వెనుక నుయ్యిలా మారిందనడంలో సందేహం లేదు.

Revanth.. Its backstabbing!!:

Why Revanth Reddy silence in Chandrababu arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement