Advertisement
Google Ads BL

గుంటూరు కారం పై థమన్ స్వీట్ న్యూస్


గుంటూరు కారం షూటింగ్ మాత్రమే కాదు, దానికి పని చేసే టెక్నీషియన్స్ విషయంలోనూ నిన్నమొన్నటివరకు చాలా గందరగోళం నడిచింది, ముఖ్యంగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుంటూరు కారం నుండి తప్పుకున్నాడని సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. థమన్ ఇండైరెక్ట్ గా ఈ గాసిప్ రాయుళ్ళకి గట్టిగా కోటింగ్ ఇచ్చినా ఆ ప్రచారానికి బ్రేకులు పడలేదు. 

Advertisement
CJ Advs

ఇక గుంటూరు కారం నుండి మహేష్ పుట్టినరోజు ఆగష్టు 9 న ఫస్ట్ సింగిల్ అంటూ మహేష్ ఫాన్స్ ఎగ్జైట్ అయినా అది జరగలేదు. ఆగష్టు 15 న ఖచ్చితంగా వస్తుంది అన్నారు. అప్పుడు కూడా మహేష్ అభిమానులు డిస్పాయింట్ అయ్యారు. తాజాగా థమన్ గుంటూరు కారం మ్యూజిక్ పై గుడ్ న్యూస్ చెప్పాడు. #Progress #GunturKaaram Music...🎵🎧#Trivikram sir ✊🤗 అంటూ పోస్ట్ చేసిన పిక్ వైరల్ అయ్యింది. 

అంటే గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది అని థమన్ స్వీట్ గా చెప్పకనే చెప్పేసాడు అనేలా ఈ ట్వీట్ ఉంది. థమన్ తన మొహాన్ని చేతులో దాచుకోగా.. తివిక్రమ్ థమన్ భుజంపై చెయ్యి వేసిన ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వినాయక చవితికి గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది ఇది పక్కా.. మహేష్ ఫాన్స్ రెడీ అవ్వండి సెలెబ్రేషన్స్ కోసం. 

Thaman sweet news on Guntur Kaaram:

 Guntur Kaaram music update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs