Advertisement
Google Ads BL

ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క..!


టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయ్. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒకలెక్క అంటోంది టీడీపీ. నిన్న లోకేష్, ఇవ్వాళ బాలయ్య మాటలతో సీన్ మారిపోయింది అని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏం జరిగింది..! 

Advertisement
CJ Advs

వస్తున్నా.. వచ్చేస్తున్నా!

ఇక తాను రంగంలోకి దిగుతున్నానని తానే ముందుంటానని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్నారు. ఇక మీదట టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. స్వాతంత్ర్యం సమరం మనం చూడలేదు కానీ ఆ స్ఫూర్తితో పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వనాశనం అవుతుందని.. ప్రతి ఒక్కరూ సైనికుల్లా తిరగబడాలని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 

శ్లోకం చెప్పి మరీ!

ఇక జగన్ గురించి బాలయ్య మాట్లాడుతూ ఒక శ్లోకం చెప్పి తిట్టిపోశారు. జగన్‌కు మనుషులంటేనే అలర్జీ .. ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు విదులుస్తుంటాడని.. రూ.10 ఇచ్చి రూ.100 గుంజుకుంటాడని విమర్శించారు. జగన్ లండన్ ఎందుకెళ్లారని ప్రశ్నించారు. ఇవాళే జగన్ ఏపీకి వచ్చాడని..ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమోనని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం యువతను గంజాయికి బానిసలుగా మార్చేస్తోందని విమర్శించారు. హిందూపురంలో ప్రభుత్వాస్పత్రిలో పందులు.. పశువులు తిరుగుతున్నాయన్నారు. జగన్ ఏపీని ప్రపంచ పటంలో లేకుండా చేశారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి సర్వనాశనం చేశారని బాలయ్య విమర్శించారు.

Balakrishna Fires On Jagan:

Balayya Fires On Jagan Over Chandrababu Arrest 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs