Advertisement
Google Ads BL

బావ - బావమరిది క్లాష్ తప్పిందిగా!


ఇంకేంటి దేవర-పుష్ప చిత్రాలు రెండు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో బావ-మవమరుదుల మద్యన గట్టిగా క్లాష్ వస్తుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. అసలే బావా అంటూ బావా అంటూ ఎన్టీఆర్-అల్లు అర్జున్ లు ఈ మద్యన సోషల్ మీడియాని ఊపేస్తున్నారు, అభిమానులకి కిక్ ఇస్తున్నారు. వీరి మద్యన పోటీ అంటే అభిమానులు సైతం అవాక్కయ్యారు. మార్చ్ చివరి వారంలో పుష్ప 2 రిలీజ్ ఉంటుంది అంటూ గట్టిగానే ప్రచారం జరిగింది. 

Advertisement
CJ Advs

అసలే 2 నేషనల్ అవార్డ్స్ గెలిచిన పుష్ప 1 కి సీక్వెల్ అది. భారీ హైప్ ఉంటుంది. పుష్ప 2 గనక మార్చ్ లో వస్తే ఎన్టీఆర్ దేవరకి ఎంతో కొంత ఇబ్బంది తప్పదనే ఊహాగానాలు నడిచాయి. 

కానీ పుష్ప 2 ని వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించగానే.. అభిమానులు బావ-బావమరుదులు క్లాష్ తప్పిందిగా అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది రిలాక్స్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఆప్యాయంగా అల్లు అర్జున్ బావా అని సంబోధించడం, దానికి రిప్లై గా అల్లు అర్జున్ కూడా అంతే ప్రేమతో బావా అనడం ఇవ్వన్నీ అభిమానులకి తెగ నచ్చేస్తున్నాయి. 

ఇక ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీ ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. దేవర షూటింగ్ దానికి అనుగుణంగా నీట్ గా సాగిపోతుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 కూడా కూల్ గా ఆగష్టు డేట్ ని లాక్ చేసుకుంది. దాని షూటింగ్ హడావిడి చూస్తూనే ఉన్నాము. 

Clash of brother-in-law is missed!:

Devara vs Pushpa 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs