కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్ ఈ నెల మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 28 నుండి ప్రభాస్ సలార్ తప్పుకోవడంతో కిరణ్ అబ్బవరం తన సినిమా రూల్స్ రంజన్ ఈ నెల 29 న విడుదల చేస్తున్నట్టుగా కొత్త డేట్ లాక్ చేసి ప్రమోషన్స్ షురూ చేసాడు. తాజాగా ఇప్పుడు మరోసారి సినిమాని పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. రూల్స్ రంజన్ ని మరో వారం వెనక్కి జరిపారు. ఈ నెల 29 నుండి వచ్చే నెల అంటే అక్టోబర్ 6 న రూల్స్ రంజన్ రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త డేట్ లాక్ చేసి పోస్టర్ తో సహా ప్రకటించారు.
ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాల కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం ను అక్టోబర్ 6 న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.