Advertisement
Google Ads BL

బ్యూటిఫుల్ లుక్ తో కనువిందు చేస్తున్న శ్రీలీల


ప్రస్తుతం టాలీవుడ్ లో మార్మోగిపోతున్న పేరు శ్రీలీల. ఏ సినిమా అప్ డేట్ వదిలినా శ్రీలీల పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన స్కంద ఈ నెల 28 న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆ సినిమా అప్ డేట్స్ వరసగా అభిమానులని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. వచ్చే నెల అక్టోబర్ 19 న బాలయ్య భగవంత్ కేసరితో రాబోతుంది. ఇక నవంబర్ లో ఆదికేశవ మూవీ ఉంది. డిసెంబర్ లో నితిన్ ఎక్స్ట్రా, జనవరిలో మహేష్ గుంటూరు కారం అంటూ నెలకో సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. 

Advertisement
CJ Advs

తాజాగా వైష్ణవ్ తేజ్ ఆది కేశవ్ సాంగ్ లో శ్రీలీల డాన్స్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. స్కందలో రామ్ తో, ఆది కేశవ్ లో వైష్ణవ తేజ్ తో కలిసి శ్రీలీల డాన్స్ కుమ్మేసింది. సోషల్ మీడియాలో శ్రీలీల పిక్స్ కనిపిస్తే యూత్ కి పండగే అన్నట్టుగా ఉంది. శ్రీలీల ఎంత మోడరన్ అవుట్ ఫిట్ వేసినా, ఎంత గ్లామర్ డ్రెస్ వేసినా అస్సలు వెగటుగా అనిపించదు. అంత క్యూట్ గా స్వీట్ గా ఉంటుంది. 

పబ్లిక్ ఫంక్షన్ లో ఎక్కడ కనిపించినా శ్రీలీల ట్రెడిషనల్ గా చుడీదార్స్, సారీస్ లో కనువిందు చేస్తుంది. తాజాగా వైట్ డ్రెస్ లో శ్రీలీల వదిలిన పిక్స్ చూస్తే చూపులతో చంపేస్తుందేమో అంటారు. కొంతమంది అయితే కరిష్మా లుక్ తో కనువిందు చేస్తున్న శ్రీలీల అంటూ కామెంట్స్ చేస్తూ ఆ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు. 

Sreeleela beautiful look:

Sreeleela picks a white stone studded anarkali suit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs