జబర్దస్త్ పంచ్ ప్రసాద్ కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడవడంతో అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మరి కిడ్నీ మార్పిడి చెయ్యాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారంతో పాటుగా అతనికి మ్యాచ్ అయ్యే కిడ్నీ డోనర్ దొరకాలి. పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ఆపరేషన్ కోసం అయ్యేందుకు ఖర్చు మేము పెట్టుకుంటామంటూ చాలామంది చెప్పినా అది లక్షల్లో కూడిన వ్యవహారం.
ఇక కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగాలన్నా అతని ఆరోగ్యం పూర్తిగా సహకరించాల్సిందే. కాలుకి ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రసాద్ కొద్దిరోజులు నడవలేకపోయాడు. భార్య సహాయంతో, జబర్దస్త్ కమెడియన్స్ సహాయంతో ఈటివిలో కాస్త బిజీగానే కనిపిస్తున్న పంచ్ ప్రసాద్ కి తాజాగా కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో సక్సెస్ ఫుల్ గా పూర్తయినట్లుగా, ఈ ఆపరేషన్ జరిగి ప్రసాద్ ఆరోగ్యంగా ఉన్నాడని, త్వరలోనే మీతో మట్లాడాడతాడని.. ఈ ఆపరేషన్ కి రోజా గారు హెల్ప్ చేసినట్లుగా పంచ్ ప్రసాద్ భార్య తెలియజేసింది.
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై ఎప్పుడు ఉత్సాహంగా పంచ్ లు వేస్తూ కామెడీ చేసేవాడు. ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కి జబర్దస్త్ కమెడియన్స్, ఆయన స్నేహితులు ఇలా కూడా చాలామంది హెల్ప్ చేసారు. ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యంగా ఉండడం ఆయన అభిమానాలకి ఊరటనిచ్చింది.