Advertisement
Google Ads BL

రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్-అసంతృప్తిలో ఫాన్స్


ఆదివారం సాయంత్రం చెన్నై లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్ జరిగిన విషయం తెలిసిందే. రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ అంటే అభిమానులు ఆగుతారా.. ఆధిక ధరలకు టికెట్స్ కొని మరీ రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ లో వాలిపోతారు. నిన్న రాత్రి కూడా అదే జరిగింది. వేలాదిగా రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం టికెట్స్ కొనుక్కుని ఆ ఈవెంట్ జరిగిన ప్రదేశానికి వచ్చేసారు కానీ అక్కడ ఈవెంట్ ఏర్పాట్లని చూసి అభిమానులు సైతం షాకయ్యారు. 

Advertisement
CJ Advs

టికెట్ ని ఎక్కువ రేట్లకి కొనుగోలు చేసి ఆత్రంగా మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్న చెన్నైలోని ఆదిత్యారామ్ ప్యాలెస్ కి వెళిపోతే.. అక్కడ కొంతమంది అభిమానులని లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆపెయ్యడమేకాకుండా.. లోపలికి వెళ్లిన వాళ్ళకి సరిపడా కుర్చీలు కూడా లేకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై అక్కడ ఈవెంట్ నిర్వాహకులపై అభిమానులకి ఆగ్రహం తెప్పించింది. 

ACTC వారు రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్ కి ఆర్గనైజర్లు గా వ్యవహరించారు. కానీ ఈవెంట్ ని ఆర్గనైజ్ చెయ్యడంలో ACTC వారు టోటల్ గా ఫెయిల్ అవడంతో మ్యూజిక్ లవర్స్ తమ అసంతృప్తిని వ్యకం చేస్తున్నారు. 

AR Rahman Chennai concert earns flak for poor management:

AR Rahman Chennai Concert Turns Nightmare, Angry Fans SLAM Organisers For Mismanagement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs