అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అరెస్ట్ చేసి.. ఆయన్ను ఏదో ఒకరకంగా ఇబ్బంది పెట్టాలన్న అహంతో వ్యవస్థలను వాడుకొని సీఎం వైఎస్ జగన్ రెడ్డి చేయాల్సినవన్నీ చేసేశారు. ఏపీ సీఐడీ మోపిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించేసింది సీఐడీ. బాబును గత రెండ్రోజులు ఇబ్బంది పెట్టిన సీఐడీ.. రిమాండ్‌లోకి తీసుకొని మరింత ఇబ్బంది పెట్టాలని అనుకున్న ప్రభుత్వం.. ఈ విషయంలో సక్సెస్ అయ్యింది. బాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. 40 ఇయర్స్ అని చెప్పుకున్న చంద్రబాబును అరెస్ట్ చేయడం, విచారణతో ఇబ్బంది పెట్టడం, కోర్టు మెట్లెక్కించడం ఇవన్నీ తన అహం చల్లార్చుకోవడానికి జగన్ చేసిన కుట్రేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు, సామాన్య జగన్ సర్కార్‌ను దుమ్మెత్తి పోస్తోంది. రెండ్రోజులుగా బహుశా ఇదివరకెన్నడూ లేని రేంజ్‌లో జగన్‌పై ట్విట్టర్‌లో బూతుల వర్షం పడుతోంది!.
ఏమిటీ కేసు..?
ఎప్పుడో చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం 2021లో కేసులు, కోర్టులు, తీర్పులతో ముగిసిపోయాయి. అయితే.. తాను 16 నెలలు జైలులో ఉండటం, జైలుకెళ్లడానికి చంద్రబాబు కూడా ముఖ్య కారణమని భావించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. 16 రోజులైనా అదీ కుదరకపోతే 16 గంటలైనా.. ఇదీ వీలుకాకుంటే కనీసం 16 నిమిషాలు, సెకనులైనా అరెస్ట్ చేయాలన్నది జగన్ చిరకాల కోరిక.! ఇందుకు అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ జగన్ తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. సీన్ కట్ చేస్తే.. ఎప్పుడో సమసిపోయిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీఐడీతో జగన్ బయటికి తీయించారు. అటు జగన్ ఆదేశాలు వచ్చిందే తడువు ఎన్నికల ముందు జిల్లాల పర్యటనలో వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగడుతున్న చంద్రబాబును నంద్యాలలో హడావుడిగా అరెస్ట్ చేసింది సీఐడి. నంద్యాల నుంచి విజయవాడకు తరలించడానికి ఎంత హైడ్రామా నడించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అరెస్ట్ నుంచి తీర్పు దాకా..!
అరెస్ట్ చేసిన చంద్రబాబును నేరుగా నంద్యాలలో ఉన్న కోర్టుకు తరలించొచ్చు కానీ.. ముందుగా అనుకున్నట్లుగానే విజయవాడ ఏసీబీ కోర్టుకే తీసుకెళ్లారు. అరెస్ట్ తర్వాత కచ్చితంగా 24 గంటలలోపు కచ్చితంగా కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. కానీ మొదట విచారణకు తీసుకోవడం శనివారం రాత్రంతా నిద్రాహారాలు లేకుండా.. కనీసం గంటపాటు కూడా విశ్రాంతి ఇవ్వకపోవడం, వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా అధికారులు ప్రవర్తించారు. అటు నుంచి నేరుగా విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్లారు. రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ.. అస్సలు ఇవ్వొద్దని చంద్రబాబు తరఫున సీనియర్ మోస్ట్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదించారు. కోర్టులో ఉదయం చంద్రబాబు వాంగ్మూలం తీసుకోవడం, ఆ తర్వాత తనకేసును తానే స్వయంగా వాదించుకుంటానని కోర్టును అనుమతి కోరడం.. ఓకే అనడంతో స్వయంగా వాదించుకున్నారు. ఆ తర్వాత అసలు ఏంటీ స్కిల్ కేసు..? ఇందులో చంద్రబాబు పాత్రేంటి..? ఎప్పుడు జరిగింది..? ఎవరెవరున్నారు..? అనే విషయాలను సీఐడీ తరఫును ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిశితంగా కోర్టుకు వివరించారు. రిమాండ్ రిపోర్టు సమర్పించగా.. అందులో మొత్తం చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఐడీ చీఫ్ సంజయ్ ఏం చదివారో సేమ్ టూ సేమ్ దింపేయడం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎఫ్ఐఆర్‌లో అప్పటికప్పుడు హడావుడిగా బాబు చేర్చింది సీఐడీ. దీంతో అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆఖరికి ఏసీబీ జడ్జి కూడా ఏంటీ కేసు..? ఎఫ్ఐఆర్‌లో ఇప్పుడు చేర్చడమేంటి..? అని ప్రశ్నించడం గమనార్హం.
రంగంలోకి దిగిన లూథ్రా!
ఢిల్లీ నుంచి చంద్రబాబు కేసును వాదించడానికి శనివారం సాయంత్రమే విజయవాడ వచ్చిన లూథ్రా నేరుగా రంగంలోకి దిగిపోయారు. అసలు చంద్రబాబును అరెస్ట్ ఎలా చేస్తారు..? గవర్నర్ అనుమతి తీసుకున్నారా..? 409 సెక్షన్ గురించి మీకేం తెలుసు..? అసలు అరెస్ట్ చేసే తీరు ఇదేనా..? అని కోర్టులోనే జడ్జి ముందే.. సీఐడీ అధికారులను, ప్రభుత్వం తరఫు లాయర్‌ను కడిగిపారేశారు. ఏకథాటిగా మధ్యాహ్నం 12 :00 గంటల నుంచి దాదాపు సాయంత్రం వరకూ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతున్న మాటలు, ప్రశ్నలు, లేవనెత్తిన సాంకేతిక అంశాలతో కోర్టు మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యింది. అలా ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. గంటపాటు బ్రేక్ తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పరిశీలించింది. చివరికి చంద్రబాబుకు రిమాండ్ అక్కర్లేదని.. తీర్పునిచ్చేసింది. చూశారుగా.. లూథ్రా అంటే ఎట్లుంటదో. ఈయన కేసు తీసుకుంటే రోజుకు కోటి నుంచి కోటిన్నర రూపాయిలు తీసుకుంటారని సమాచారం.
పక్కా ప్లాన్ ప్రకారమే..?
ముందుగా అనుకున్నట్లుగానే సీఐడీ పదే పదే అడిగిన రిమాండ్‌ను కోర్టు అంగీకరించింది. రిమాండ్‌కు ఇవ్వడంతో పోలీసులు వెంటనే విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి పోలీసులు సర్వం సిద్ధం చేసేశారు. వాస్తవానికి ఇవాళ ఉదయం నుంచే కోర్టు పరిసర ప్రాంతాలతో పాటు.. రాజమండ్రి వెళ్లే రూట్‌లో పోలీసులు భారీగా మోహరించారు. బాబుకు బయటికి రాగానే కాన్వాయ్‌లోకి తీసుకెళ్లాలని భారీ కాన్వాయ్‌నే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదంతా చూస్తుంటే తీర్పు ఎలా వస్తుంది..? ఏంటి పరిస్థితి..? అనేది ముందుగానే తెలుసని ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్ ప్రభుత్వం.. అదే జగన్ రాసిన స్క్రిప్ట్‌ను అచ్చుగుద్దినట్లుగా సీఐడీ దింపేసిందన్న మాట. రిమాండ్‌కు అయితే తరలించారు.. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి. అప్పుడెప్పుడో హుబ్లీలో 14 ఏళ్ల కిందట చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇంతవరకూ చంద్రబాబును టచ్ చేసిన వాళ్లెవరూ లేరు. బాబుపై ఆరోపణలు చేసినా అవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయే కానీ ఎక్కడ నిరూపితమైన సందర్భాల్లేవ్. అయితే.. ఫస్ట్ టైమ్ చంద్రబాబును జగన్ రెడ్డి టచ్ చేశారు. తన అహం చల్లార్చుకోవడానికి.. 73 ఏళ్ల వయస్సున్న చంద్రబాబును అరెస్ట్ చేయించారు. అనుకున్నట్లుగానే అదీ ఏపీలో లేకున్న టైమ్‌లోనే ఇదంతా జరగడం, లండన్‌లో జగన్ ఎంజాయ్ చేస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో వైసీపీ శ్రేణులకే తెలియాలి మరి.