Advertisement
Google Ads BL

Mega157: మెగా అప్‌డేట్.. ఫ్యాన్స్ ఖుష్


ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. బింబిసార చిత్రంతో వశిష్ట దర్శకుడిగా 100కి 100 మార్కులు వేయించుకున్నారు. ఇప్పుడు ఆయన చేతికి మెగా157 చేరడంతో అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే.. పంచభూతాలతో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. ఇదొక ఫాంటసీ అడ్వెంచర్‌ అనే విషయాన్ని తెలియజేసింది. దీంతో మెగాస్టార్ నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని అంతా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతగానో వేచి చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్‌ని విడుదల చేశారు. చిత్ర ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ప్రారంభించినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. దర్శకుడు వశిష్ట కూడా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లుగా తెలుపుతూ.. త్వరలో అందరినీ సినిమాటిక్ అడ్వంచర్‌కు తీసుకెళ్లేందుకు మేమంతా సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చారు. అంతే కాదు, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, డీవోపీ ఉన్న ఫొటోని కూడా ఆయన షేర్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ Mega157 ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చేశారు.

ఛోటా కె నాయుడు డివోపీగా పని చేస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. ఇక వశిష్ట పోస్ట్ చేసిన ఫొటోలో టీమ్ అంతా చాలా హ్యాపీగా కనిపిస్తోంది.

Mega157 Pre Production Works Begin:

Megastar Chiranjeevi and Vassishta Film Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs