Advertisement
Google Ads BL

తను ఓడిపోతానని జగన్ డిసైడ్ అయ్యాడా?


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో కొన్ని రాజకీయ సమీకరణాలు వెలుగు చూస్తున్నాయి. అసలే ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ తరుణంలో తీసుకునే ప్రతి స్టెప్ ఆచి తూచి తీసుకోవాలి. ఒక్క రాంగ్ స్టెప్ వేసినా కూడా అసలుకే మోసం వస్తుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయడమంటే ఒక సాహసోపేతమైన స్టెప్ అనే చెప్పాలి. గత ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు వైసీపీ అధినేత జగన్‌ను ఏపీ సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. వాటిలో ఒకటి వైఎస్ వివేకా హత్య, మరొకటి కోడి కత్తి. ఈ రెండు పరిణామాలతో జగన్‌కు కావల్సినంత మైలేజ్ వచ్చింది.

Advertisement
CJ Advs

బాబాయి హత్యను అయినవారు చేస్తే.. దానిని టీడీపీకి అంటగట్టి హైడ్రామా ఆడి మొత్తానికి జనాల్లో కావల్సినంత సింపథీ కొట్టేశారు. ఇక ఆ తరువాత విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో పొడిపించుకున్నారు. వెంటనే ఏం చేయాలి? విశాఖలోని హాస్పిటల్‌కు కదా వెళ్లాలి? కానీ హైదరాబాద్ వచ్చి ఇక్కడి ఆసుపత్రిలో చేరి దీనిని కూడా టీడీపీ మెడకు కట్టేసి బీభత్సమైన మైలేజ్ సాధించారు. ఈ రెండు ఘటనలతో టన్నుల్లో జనాల్ల సింపథీ వచ్చేసి జగన్‌కు ఊహించనన్ని సీట్లను కట్టబెట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ ఏకులా వచ్చి జగన్ మేకై కూర్చొన్నారు. ఇటీవలి కాలంలో వస్తున్న అంతర్గత సర్వేలన్నీ నెగిటివ్‌గానే ఉన్నాయని టాక్. పైకి మాత్రం పెయిడ్ సర్వేలతో వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

ఇక ఇప్పుడు హైడ్రామా నడిపి చంద్రబాబును అరెస్ట్ చేయించడంతో తను ఓడిపోతానని జగన్ పక్కాగా డిసైడ్ అయిపోయారంటూ టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తను జైలులో ఉన్న మాదిరిగానే చంద్రబాబును సైతం కొన్ని క్షణాల పాటైన జైలులో చూడాలన్న కక్షతోనే ఆయనను అరెస్ట్ చేయించారంటూ టాక్ నడుస్తోంది. వస్తున్న అంతర్గత సర్వేలన్నీ యాంటీగా రావడంతో ఇక నెక్ట్స్ తను అధికారంలోకి వచ్చే అవకాశం లేదని.. ఇప్పటికే తనపై బీభత్సమైన నెగిటివిటీ వచ్చిందని జగన్ డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. లేదంటే ఒకరకంగా ఇప్పుడు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా లేకుండా.. పక్కా ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయనకు బీభత్సంగా సింపథి వస్తుందని జగన్‌కు ఆమాత్రం తెలియదా? అని జనం చర్చించుకుంటున్నారు. తన పని అయిపోయిందని డిసైడ్ అయ్యాకే జగన్ ఈ అరెస్ట్‌కు పూనుకున్నారని చర్చ జరుగుతోంది.

Has Jagan decided that he will lose:

Does YS Jagan know his future    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs