Advertisement
Google Ads BL

తమ్ముడు తమ్ముడే.. తేల్చేసిన గవర్నర్


తెలంగాణ గవర్నర్ తమిళి సై.. ఆమె అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అధికార పార్టీ ఎంత ప్రెజర్ పెట్టినా కూడా ఆమె తలొగ్గే ప్రసక్తే ఉండదు. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్‌కు.. ప్రగతి భవన్‌కు మధ్య బీభత్సమైన గ్యాప్ పెరిగింది. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కానీ.. సచివాలయం ప్రారంభోత్సవానికి కానీ తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఆహ్వానం పంపించలేదు. గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం కయ్యానికి దిగింది. అయినా సరే ఆమె తలొగ్గ లేదు. కానీ ఏమైందో ఏమో కానీ సడెన్‌గా సీఎం కేసీఆర్‌లో మార్పు వచ్చింది. తమిళిసైని రాజభవన్‌కు ఆహ్వానించి.. రాజ్‌భవన్ మొత్తం తిప్పి చూపించారు. ఆ తరువాత మీడియా కూడా రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు దూరం తగ్గిందంటూ కోడై కూసింది.

Advertisement
CJ Advs

తాజాగా తెలంగాణ గవర్నర్ గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ తమిళిశై రాజ్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. ఆమె మాటల సారాంశం చూస్తే.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. అని తేల్చేసినట్టుగా ఉన్నాయి. ఓవైపు కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు తగ్గేదే లేదని తేల్చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్ అని.. పవర్ ఫుల్ నేత అని.. నాలుగేళ్లుగా ఆయన పాలన చూస్తున్నానని తమిళిసై ప్రశంసలు కురిపించారు. అంతే కాదు.. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్‌ ఏమాత్రం లేదని..  సీఎంతో ఎలాంటి దూరం లేదని తేల్చేశారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండు. ఇప్పటి వరకూ ఆమె వ్యాఖ్యలు వింటూ ఫుల్ ఖుషీ అవుతున్న గులాబీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. 

సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కానని గవర్నర్ తేల్చి చెప్పారు. కోర్టు కేసులకు, విమర్శలకు తాను భయపడేదే లేదన్నారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనతో తనను కట్టడి చేయలేరని ఇన్‌డైరెక్ట్‌గా ప్రభుత్వానికి తమిళిసై వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బిల్లులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైళ్లపై సంతకాలు పెడతారా? అని మీడియా తమిళిసైని ప్రశ్నించగా.. తన అభిప్రాయాలను మార్చుకోబోనని తమిళిసై స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుందని.. అది పొలిటికల్ నామినేషన్ కాదని స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అర్హత ఉందనిపిస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మొత్తానికి ఇప్పుడు సిఫారసు చేసిన ఫైళ్లపై సంతకాలు చేసేదే లేదని తమిళిసై చెప్పకనే చెప్పేశారు. మరి ఇక కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

Telangana Governor Tamilisai Soundararajan Comments on KCR Ruling:

Tamilisai Soundararajan Praises On KCR Government     
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs