Advertisement
Google Ads BL

దగ్గుబాటివారి డెస్టినేషన్ వెడ్డింగ్ డిటైల్స్


దగ్గుబాటి మూడోతరం వారసుల్లో హీరో రానా కరోనా సమయంలో ప్రేమించిన అమ్మాయి మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేశాడు. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా రానా-మిహికాల పెళ్లి జరిగింది. ఇక ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ పెళ్లికి రెడీ అయ్యాడు. అభిరామ్ పెళ్లి ఆయన అత్త కూతురుతోనే జరగబోతుంది. సురేష్ బాబు చిన్నాన్న కూతురు కూతురితోనే అభిరాం పెళ్లి జరగబోతుంది. 

Advertisement
CJ Advs

కారంచేడులో ఉండే రామనాయుడి తమ్ముడి మనవరాలితో అభిరామ్ వివాహానికి దగ్గుబాటి ఫ్యామిలీ ఏర్పాట్లని మొదలు పెట్టేసింది. అయితే ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ప్లాన్ చేస్తున్నారట. అభిరామ్ పెళ్లి డిసెంబర్ 6న నిశ్చయించినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 6న శ్రీలంకలో అభిరామ్ పెళ్లి అత్త కూతురుతో జరగబోతుందని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లని దగ్గుబాటి కుటుంబం మొదలు పెట్టినట్లుగా టాక్ నడుస్తోంది. 

పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ చేయాలని దగ్గుబాటి కుటుంబం ప్లాన్ చేయడమే కాదు.. డిసెంబర్ 6న పెళ్లికి సంబంధించిన శుభలేఖలను కూడా డిఫరెంట్‌గా అచ్చువేయిస్తుందట. ఇక అహింసతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిరామ్‌కి ఆ చిత్రం బిగ్ షాక్‌ని ఇచ్చిన విషయం తెలిసిందే.

Daggubati Abhiram Wedding Details:

Daggubati Abhiram Ready to Destination Wedding  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs