Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయగలరా?


ఏపీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన సైకోయిజం మొదలెట్టాడు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడుగా.. ఇప్పుడందరినీ తనలానే జైల్లో పెట్టించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగానే నేడు చంద్రబాబుని, ఆయన అనుచరగణాన్ని అరెస్ట్ చేయించి.. ఫారిన్‌లో సైకో ఆనందం పొందుతున్నాడు. చంద్రబాబుతో పాటు గంటా శ్రీనివాసరావు, ఆయన కొడుకు రవితేజని కూడా అరెస్ట్ చేయగా.. బాబు తనయుడు లోకేష్‌ని కూడా అరెస్ట్ చేసేందుకు ఏపీ యంత్రాంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే ఈ అరెస్ట్‌ల పర్వంతో ఇప్పుడు ఏపీ ప్రజలకు మంచి పని పడింది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ‌ల గురించి ఏపీ ప్రజలు ఆలోచించే సమయం ఆసన్నమైంది. అదెలా అంటారా.. 

Advertisement
CJ Advs

16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాడిని సీఎం చేస్తే.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నాడు. అలాగే 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏపీకి దిక్కు ఎవరు? కష్టం వస్తే అండగా నిలబడే నాయకుడెవరు? అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే సమాధానమే వస్తుంది. ఎలాంటి అవినీతి మరకలు లేని స్వచ్ఛమైన నాయకుడు, పొలిటిషీయన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుని అరెస్ట్ చేయగలిగారు కానీ.. నడిరోడ్డు మీద జగన్ కుట్రలని, కుతంత్రాలని, అవినీతిని బయటపెట్టిన పవన్ కళ్యాణ్ చిటికెన వేలు కూడా కదిలించలేకపోయారు. ఎందుకంటే.. ఆయన చెబుతున్నది సత్యం కాబట్టి. సపోజ్ పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేసి ఉంటే.. ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించి చూడండి.. రాష్ట్రం తగలబడేది. కారణం.. నిజాయితీకి ఉన్న పవర్ అలాంటిది. 

ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే తెలుగు తమ్ముళ్లు ఊగిపోయే ఉడత ఊపుల్లా అయితే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే రాష్ట్రం అట్టుడికిపోతుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌ని ఏం చేయలేక.. చట్టబద్దంగా చేసుకున్న ఆయన పెళ్లిళ్ల జపం చేస్తుంటారు. కారణం.. పవన్ కళ్యాణ్‌ని వేలెత్తి చూపించే మరో కారణం వారి దగ్గర లేదు.. ఉండదు కూడా. అందుకే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పెళ్లిళ్లు, పెళ్లాలు అంటూ గింజుకోవడం తప్ప.. చించేదేం లేదు. ఆ మధ్య ఓ వలంటీర్‌తో కేసు పెట్టించి కళ్యాణ్‌ని అరెస్ట్ చేయించాలని చూసి.. కోర్టులో మొట్టికాయలు వేయించుకున్నారు. వైజాగ్‌లో ఏదో చేయాలని ప్లాన్ చేశారు.. కానీ పవన్ కళ్యాణ్ సంయమనం పాటించడంతో వారి పాచికలు పారలేదు. ఇవన్నీ చూస్తుంటే.. న్యాయంగా ఉండే వాడికి పంచభూతాలు కూడా సహకరిస్తాయనేది ఇక్కడ స్పష్టమవుతుంది. 

దేశాన్ని ప్రేమించే వాడు నాయకుడు అయితే ఎలా ఉంటాడో.. అదే పవన్ కళ్యాణ్. ఒక్కసారి అధికారంలోకి వస్తే.. ఏపీ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ కాపు కాచే తీరు చూసి.. మళ్లీ ఎక్కడ తమకి అధికారం రాదో అని కుట్రలు మీద కుట్రలు చేసే నాయకుల తీరుని ప్రజలు గమనిస్తే.. ఏపీ రాష్ట్ర భవిష్యత్ ఇంకోలా ఉంటుంది. గమనించకపోతే.. వారి ఖర్మ అని వదిలేయడమే. ఇక నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది.

Can Jagan Arrest Pawan Kalyan?:

After Chandra Babu, Can Jagan Touch Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs