Advertisement
Google Ads BL

లోకేష్‌ అరెస్ట్‌కు కూడా రంగం సిద్దం..!


టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. త్వరలోనే టీడీపీ యువనేత నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పైగా చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ మాట్లాడుతూ లోకేష్ ప్రస్తావన తెచ్చారు. దీంతో లోకేష్ అరెస్ట్ పక్కా అని స్పష్టం అయ్యింది. లోకేష్‌ని కూడా విచారించాల్సి ఉంటదని సీఐడీ చీప్ చెప్పుకొచ్చారు. అవసరం ఐతే లోకేష్ ను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మరోవైపు లోకేష్ పాదయాత్రను కూడా పోలీసులు అడ్డుకున్నారు.. రెస్ట్ తీసుకోమని ఉచిత సలహా కూడా ఇవ్వడం గమనార్హం.

Advertisement
CJ Advs

మొత్తం బాబే చేశారు..!

ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాం. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అనేది రూ.550 కోట్లు. దీని కారణంగా ప్రభుత్వానికి రూ.371 కోట్ల నష్టం వచ్చింది. ఇది లోతైన ఆర్ధిక నేరం. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది. ఈ విచారణలో ముఖ్య పాత్రధారిగా చంద్రబాబు ఉన్నారు. అందుకే కస్టడీలో తీసుకున్నాం. అన్నింటిలోనూ చంద్రబాబు ప్రమేయం ఉందని సృష్టం అయింది. అన్ని వెలుగులోకి తేవడానికి కస్టడీలో విచారణ జరపాల్సి ఉంటుంది. నకిలీ ఇన్ వాయిస్ ద్వారా సెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడేనని తేలిది. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు. ఈ స్కాముకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు మాయం చేశారు. ఈడీ..  జీఎస్టీ ఏజెన్సీలు కూడా ఈ స్కాంపై దర్యాప్తు చేశాయి. ఈ స్కామ్ లో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే అని సీఐడీ చీఫ్ తెలిపారు.

విచారణ తర్వాత..!

న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశామని సీఐడీ చీఫ్ వెల్లడించారు. నారా లోకేష్, కిల్లర్ రాజేష్ లపై కూడా చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. చంద్రబాబు తర్వాత నెక్స్ట్ టార్గెట్ నారా లోకేష్, కిల్లర్ రాజేషేనని సీఐడీ అధికారులు చెప్పకనే చెబుతున్నారు. ఏపీ ఫైబర్ నెట్‌, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులోనూ నారా లోకేష్ పాత్రపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. విచారణ అనంతరం ఈ కేసులో రాజేశ్, నారా లోకేష్ పాత్రలు ఎంత ఉన్నాయన్నది తెలుస్తుందని సీఐడీ చీఫ్ వెల్లడించారు.

After Chandrababu Arrest YSRCP Eye on Lokesh:

AP Politce ready for the arrest of Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs