రీసెంట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సూపర్ హిట్ అయిన దయ వెబ్ సీరీస్‌లో కీలక పాత్రలో కనిపించిన గాయత్రీ గుప్త తన ఆరోగ్యం క్రిటికల్‌గా ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జెడి చక్రవర్తి, ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సీరీస్‌లో గాయత్రీ గుప్త ఓ కీలక పాత్రలో నటించింది. ఇదే కాకుండా ఆమె ఫిదా లాంటి చిత్రంలోనూ హీరోయిన్‌కి పక్కన ఉండే పాత్రలో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన గాయత్రీ గుప్త తన ఆరోగ్యంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం తన ఆరోగ్యం క్రిటికల్ కండీషన్‌లో ఉందని.. రేపు ఏం జరుగుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నానని.. ట్రీట్మెంట్ కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అలాగే తన తండ్రిని తానెప్పుడూ తండ్రిలా భావించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఈ గాయత్రీ గుప్త గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ తనని మోసం చేసాడు అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.
అయితే ఇదంతా చెప్పిన గాయత్రీ అసలు తన హెల్త్ ప్రాబ్లెమ్ ఏమిటి అనేది రివీల్ చెయ్యలేదు. సమంతకి మయోసైటిస్ ఉందని పబ్లిగ్గా చెప్పింది.. ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. కానీ ఉన్న ప్రాబ్లమ్ ఏంటో చెప్పకుండా విరాళాలు సేకరిస్తానంటే.. వేరే అర్థం వస్తుంది. మరి ఆ విషయం గాయత్రీ గుప్త ఎందుకు గమనించడం లేదు అనేది ఇప్పుడు ప్రశ్న. ఏదైతేనేం.. ఈ రూపంలో ఆమె వార్తలలో హాట్ టాపిక్ అవుతోంది. ఆమెకు కావాల్సింది కూడా ఇదేనేమో..