Advertisement
Google Ads BL

నెల తిరక్కుండానే రకుల్ మరో ఖరీదైన కారు!


రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో సినిమాలు లేకపోయినా.. బాలీవుడ్‌లో బిజీగానే ఉంది. అక్కడ పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న రకుల్ తెలుగులో కనిపించి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ వస్తే మంచు లక్ష్మిని కలిసి అక్కడే పార్టీలు గట్ర చేసుకుని మళ్ళీ ముంబై చెక్కేసే రకుల్ ప్రీత్.. తాజాగా ఓ ఖరీదైన కారుని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది.  రకుల్ ప్రీత్ స్వయానా ఓ వీడియో షేర్ చేయడంతో.. ఇప్పుడీ కారు వ్యవహరం బయటికి వచ్చింది.

Advertisement
CJ Advs

రకుల్ కొన్నది లగ్జరీ కారు. దాదాపు రూ. 3 కోట్ల ఖరీదు ఉన్న మెర్సిడెస్ బెంజ్‌ని రకుల్ ప్రీత్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్ ఈ కారునే కాదు.. రీసెంట్ గానే మరో ఖరీదైన కారుని కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. అలా వార్తలు వచ్చిన నెల లోపే రకుల్ మరో కారు కొన్నట్లుగా ఇప్పుడు తాజా వీడియో చూస్తే తెలుస్తుంది. మరి ఈ కార్ల వెనుక కథేంటనేది ఆమెకే తెలియాలి. 

ప్రస్తుతం అయితే రకుల్ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఆమె నటించిన, నటస్తున్న తెలుగు సినిమాలేవీ ప్రస్తుతం లేవు. కోలీవుడ్‌‌లో మాత్రం ఇండియన్2 సినిమా చేస్తుంది. ఆ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్‌లోనూ సినిమాలు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడామెకు అవకాశాలు ఇచ్చే వారే కరువయ్యారు. మరి రకుల్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Rakul Buys New Luxury Car Worth Rs 3 Crore:

Again Rakul in News with New Car
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs