విజయ్ దేవరకొండకి లైగర్ కన్నా ముందు రెండు మూడు ప్లాప్ మూవీస్ ఉన్నాయి. అటు పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే విజయ్ దేవరకొండ డిప్రెషన్ మోడ్‌లోకి వెళ్లకుండా సెటిల్డ్‌గా అభిమానులని పక్కకి పోకుండా చూసుకోవడమే కాదు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేశాడు. దానితో విజయ్ దేవరకొండ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లుగా కనిపించాడు. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమాకి నామమాత్రపు ప్రమోషన్స్‌తో ఆడియన్స్ ముందుకు తెచ్చేశాడు.
సినిమా హిట్ అన్నారు. క్రిటిక్స్ రేటింగ్స్ వేశారు, ఆడియన్స్ బావుంది అన్నారు. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ కళకళలాడాయి. కానీ సోమవారం వచ్చేసరికి ఖుషి అసలు రంగు బయటపడింది. అయినా ఖుషిని భుజాల మీద మోస్తా అంటూ విజయ్ దేవరకొండ సక్సెస్ మీట్ పెట్టాడు. అక్కడ కూడా తన సినిమాని నెగెటివ్‌గా ప్రచారం చేయడానికి డబ్బులిచ్చారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
మరి విజయ్ ఎంతగా హడావిడి చేసినా.. సోమవారం నుండి విజయ్ ఖుషికి కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. ఆఖరికి కృష్ణాష్టమి సెలవైనా కలిసొస్తుంది అనుకుంటే దానిని జవాన్, మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టిలు పట్టుకుపోయాయి. ఆ రెండు సినిమాలకి హిట్ టాక్ రావడం ఖుషి కలెక్షన్స్ మరింతగా పడిపోవడానికి కారణమయ్యాయి. అది చూసిన నెటిజెన్స్ ఈ మాత్రం దానికేనా ఇంత హడావిడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.