Advertisement
Google Ads BL

జగన్.. నీ వరకు వస్తే బాధనిపిస్తుందా?


వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. తన పార్టీ వారికైతే ఒక లెక్క.. ఎదుటి పార్టీలైతే మరో లెక్క ఉంటుందాయన దగ్గర.! సంక్షేమ పథకాలు సైతం తమ పార్టీ వారికే ముందు.. అలాంటి జగన్ ఇటీవల చేస్తున్న కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ముసలోడు అంటూ ఆయన చేస్తున్న విమర్శలు వినేవారికి జుగుప్స కలిగించడం ఖాయం. ఇక ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణిని.. అది కూడా రాజకీయాలతో సంబంధం లేని ఆవిడను అసెంబ్లీ సాక్షిగా దారుణాతి దారుణంగా అవమానిస్తుంటే మిన్నకుండిపోయారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి.. ఆయన భార్యల గురించి పార్టీ నేతలతో పాటు ఆయన కూడా ఇష్టానురీతిన కామెంట్స్ చేశారు.

Advertisement
CJ Advs

ఎలా ఉంది నొప్పి..!

ఏదైనా తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు. జగన్, వైసీపీ నేతలు, కార్యకర్తల విషయంలో ఇది అక్షరాలా నిజమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు మంట పుట్టిస్తున్నాయి. పెట్టుబడి రాయితీలు ఇస్తామని రైతులను, ప్రజలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందంటూ పెద్ద ఎత్తున చంద్రబాబు ఫైరయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అని, ఆయన బుద్దే వక్ర బుద్ధి అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు బీభత్సంగా ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు వయస్సు పెరిగే కొద్ది.. దిగజారి ప్రవర్తిస్తున్నారని, అసలు ఆయన మనిషేనా? చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? అంటూ వైసీపీ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.

ఇప్పుడు చెప్పండి జగన్..?

అసలు వైసీపీ నేతలే బూతుల మంత్రులుగా ప్రఖ్యాతి గాంచుతున్నారు కదా..? ఒకరేమో బూతుల మంత్రి, మరొకరు సంబరాల రాంబాబు, డైమండ్ రాణి.. ఇలా ఒకరేంటి లిస్ట్ చెబుతూ పోతే చాలా మంది వైసీపీ నిక్ నేమ్‌లతో ఉత్త పుణ్యానికే వర్ధిల్లుతున్నారు కదా? నోటికి ఏది వస్తే అది మాట్లాడి కాదా..? వీరంతా కడుపుకు అన్నం కాదా? ఏంటి తినేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబునే మహిళా లోకం క్షమించదంటే.. జగన్, ఆయన పార్టీ నేతలు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు మహిళా లోకం నెత్తిన పెట్టుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఇంట్లోని మహిళ వంటి వారు కాదా ఇతర మహిళలు అని ప్రశ్నించే ముందు ఆనాడు ఏమైంది మీ బుద్ధి? మీ దాకా వస్తే కానీ నొప్పి తెలియడం లేదా? అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. 

Chandrababu Fire on YS Jagan:

Chandrababu Targets Ys Jagan Birth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs