Advertisement
Google Ads BL

జైలర్ నటుడి అకాల మరణం


నిన్న చూస్తున్న వారు ఈరోజు కనిపించడం లేదు. జిమ్ చేస్తూనో లేదంటే మారేదన్నా కారణమో చాలామంది గుండెపోటుతో అకాల మృత్యువాత పడుతున్నారు. తాజాగా కోలీవుడ్ లో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. స్టార్ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు మారిముత్తు ఆకస్మికంగా కన్ను మూయడం కోలీవుడ్ లో విషాదంగా మారింది. ఈ రోజు శుక్రవారం ఉదయం సడెన్ హార్ట్ స్ట్రోక్ కారణంగా మారిముత్తు మృత్యువాత చెందారు. 

Advertisement
CJ Advs

మారిముత్తు 57వ ఏట కన్ను మూశారని తెలుస్తుంది. మారిముత్తు మరణం తమిళ సినీ వర్గాల్లో విషాదంగా మారింది. రీసెంట్ గా మారిముత్తు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీలో విలన్ గ్యాంగ్ లో కనిపించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి ప్యాన్ ఇండియా వ్యాప్తంగా 600 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. అంతేకాకుండా నిన్న గురువారం నుండి జైలర్ ఓటిటీ ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చేసింది. ఇలాంటి సమయంలో మారిముత్తు అకస్మాత్తుగా మరణించడం తమిళనాట విషాదఛాయలు అలుముకునేలా చేసింది. 

Marimuthu Died Due To Heart Attack:

Tamil Actor Marimuthu Died Due To Heart Attack
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs