ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈ నెల 28 న విడుదల కావాల్సి ఉంది. సెప్టెంబర్ 28 అంటూ సలార్ మేకర్స్ పదే పదే చెప్పుకుంటూ వచ్చినప్పటికీ.. చివరికి అధికారిక ప్రకటన లేకుండానే సలార్ వాయిదా వేసేసారు. సెప్టెంబర్ 28 నుండి సలార్ తప్పుకోవడంతో పొలోమంటూ ఆ డేట్ కి మీడియం, చిన్న హీరోలు తమ సినిమాలు విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
అయితే సలార్ సెప్టెంబర్ నుండి తప్పుకున్నా.. మళ్ళీ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉండొచ్చు అనుకున్నారు. కానీ సలార్ ని నవంబర్ లో విడుదల చేస్తే బావుంటుంది.. అప్పటికల్లా సిజి వర్క్ కంప్లీట్ అవుతుంది అని మేకర్స్ భావిస్తున్నారట. అందులో భాగంగానే సలార్ ని నవంబర్ 10 కి విడుదల చేస్తే ఎలా ఉంటుందో అని చూస్తున్నారట.
దివాళి బరిలో సలార్ ని ఉంచాలని మేకర్స్ అనుకుంటున్నట్లుగా త్వరలోనే ప్రకటన ఇస్తారంటూ పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మరి సలార్ మేకర్స్ ఆ నవంబర్ 10 డేట్ ఏదో అఫీషియల్ గా ప్రకటిస్తే ప్రభాస్ అభిమానులు కూల్ అవుతారు. లేదంటే రేపటినుండి మేకర్స్ ని సోషల్ మీడియాలో పిచ్చ తిట్లు తిడతారు.. ఎందుకంటే సలార్ పోస్ట్ పోన్ విషయం ఇప్పటివరకు అధికారికంగా చెప్పనేలేదు.