కొద్దిరోజులుగా సక్సెస్ కి దూరమైనా సోషల్ మీడియాకి దగ్గరగా చేరిన క్యూట్ కృతి శెట్టి.. ప్రస్తుతం తమిళనాట బిజీగా మారింది. టాలీవుడ్ లో వరసగా బిగ్గెస్ట్ షాక్ లు తగలడంతో కృతి శెట్టి పనైపోయింది అనుకుంటే ఆమె మాత్రం తమిళ అవకాశాలతో షాక్ ఇచ్చింది. అయితే సినిమాలతో బిజీగా వున్న సమయంలో సోషల్ మీడియాకి కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేసిన కృతి శెట్టి ప్లాప్ లు దరి చేరగానే.. సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తోనూ హల్ చల్ చేస్తుంది.
తాజాగా కృతి శెట్టి సారీలో మెస్మరైజ్ చెయ్యడం కాదు.. అచ్చం బాపు బొమ్మలా, కుందనపు బొమ్మలా ఫొటోలకి ఫోజులిచ్చింది. రెడ్ కలర్ బెనారస్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అచ్చం తెలుగింటి ఆడపడుచులా చూడముచ్చటగా కనిపించింది. చాలా సంప్రదాయంగా అందంగా మెరిసిపోయింది. మెడ నిండా బంగారు ఆభరణాలతో.. ఆ కట్టు బొట్టు అన్ని తెలుగింటి అమ్మాయిని తలపించేదిలా ఉంది కృతి శెట్టి సారీ లుక్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.