Advertisement
Google Ads BL

హైదరాబాద్ ఎందుకొచ్చావ్ సమంతా?


సమంత ఖుషి సినిమా విడుదలకు ముందు అమెరికా వెళ్ళింది. అక్కడ ఖుషి ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొంటూనే హెల్త్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంది. అయితే గత రెండు వారాలుగా అమెరికాలో ఉన్న సమంత ఖుషి విజయం తర్వాత మళ్ళీ హైదరాబాద్ కి తిరిగివచ్చింది సమంత ఎయిర్ పోర్ట్ వీడియోస్, పిక్స్ వైరల్ అయ్యాయి. అయితే సమంత హైదెరాబాద్ కి వచ్చిన ఒక్కరోజులోనే మళ్ళీ అమెరికాకి తిరిగివెళ్ళిపోయింది అనే న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది.  

Advertisement
CJ Advs

అసలు ఒక్కరోజు ఆమె అమెరికా నుండి హైదెరాబాద్ కి వచ్చి ఏం చేసింది.. కనీసం ఖుషి సక్సెస్ మీట్ లో కూడా పాల్గొనలేదు. అసలు ఆమె హైదరాబాద్ కి ఎందుకొచ్చినట్టు అంటూ చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఖుషి మూవీలో సమంత లుక్స్ పై కూడా బోలెడన్ని విమర్శలొచ్చాయి. విజయ్ దేవరకొండకి మ్యాచ్ అవ్వలేదు, సమంత ఇకపై నటనకు దూరంగా ఉంటే బెటర్ అన్నారు. 

అందుకే సమంత కూడా ఖుషి ప్రమోషన్స్ ని లైట్ తీసుకుంది అని, ఆమె ఏదో అవసరం ఉండే ఇలా ఒకరోజులో హైదరాబాద్ వచ్చి మరీ వెళ్ళింది అంటున్నారు. ఇక ఆమె ఈ ఒక్కరోజు గ్యాప్ లో ఏదైనా కథ వినడం కానీ, ప్రత్యేకంగా ఎవ్వరిని కలవడం కాని చెయ్యలేదు అంటున్నారు. దానితో అసలు ఆమె ఇలా  అమెరికా నుండి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుండి అమెరికాకి ఎందుకొచ్చిందో అర్ధం కాక నెటిజెన్స్ తలపట్టుకుంటున్నారు. 

Why did you come to Hyderabad, Samantha?:

Samantha spent just 24 hours in Hyderabad?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs