అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలింగా, పుష్ప1 కి సీక్వెల్ గా తెరకేకుతున్న పుష్ప 2 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుష్ప1 కి గాను జాతీయ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు కి సెలెక్ట్ అవడం, వెను వెంటనే పుష్ప 2 సెట్స్ నుండి అల్లు అర్జున్ పుష్ప రాజ్ గెటప్ కోసం రెడీ అవుతున్న వీడియోని వదలడంతో అల్లు ఫాన్స్ సంతోషపడిపోయారు. ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ లో హీరోగారు, దర్శకుడు చాలా బిజీగా గడుపుతున్నారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప 2 కి సంబందించిన ఓ వీడియో లీకై హడావిడిచేస్తుంది. ఆ వీడియోలో పుష్ప 2 షూటింగ్ కోసం వరసగా కొన్ని వందల లారీలు ఆగి ఉన్నాయి. పుష్ప 2 చిత్రీకరణ కోసం ఆ లారీలు అలా వరసగా వెయిట్ చేస్తున్నాయా అనేలా ఉందా సీన్. పుష్ప 1లో లారీలతో ఎర్ర చందనం దుంగలని స్మగ్లింగ్ చేసినట్టుగా చూపించారు. అంతేకాకుండా పుష్ప 2 లో ఈ లారీలతో ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ నదిలో వెళుతున్న వీడియో ఎప్పుడో లీకైంది.
ఇప్పుడు ఆ లారీలన్ని వరసగా పెట్టి ఉన్న వీడియో లీకై వైరల్ అవడమే కాదు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అల్లు ఫాన్స్ మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా పుష్ప ద రూల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ ఎప్పుడెప్పుడు పుష్ప 2 డేట్ ఇస్తారా అనే ఆత్రంలో వారు ఉన్నారు.