షారుఖ్-నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ ఈరోజు సెప్టెంబర్ 7 న ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచడం, అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ స్థాయిలో జరగడంతో అందరి చూపు ప్రత్యేకంగా జవాన్ పై పడింది. ఇండియాలో స్పెషల్ షోస్, అలాగే యూఎస్ లోనూ ప్రీమియర్స్ మొదలయ్యాయి. జవాన్ ప్రీమియర్ టాక్ ను పరిశీలిస్తే..
విక్రమ్ రాథోర్, ఆజాద్ రాథోర్ అంటూ షారుఖ్ డ్యూయెల్ రోల్ లో ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ లోను, యాక్షన్ సీన్లతో షారుక్ దుమ్ములేపారని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. షారుఖ్ ప్రతి సీన్ లో ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ కలిగించేలా మెరిశారని అంటున్నారు.నయనతార అయితే పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో దుమ్ములేపింది.. అంటూ కామెంట్ చేస్తున్నారు. షారుఖ్ తో నయన్ కెమిస్ట్రీ బాగుందని, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ తో ఇరగదీశారని నెటిజెన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.
విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె క్యామియో అపియరెన్స్ అదిరిపోయాయట. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియెన్స్ ఫిదా అవుతారు అంటూ మరికొంతమంది ఆడియన్స్ మాట్లాడుతున్నారు. షారుఖ్ ఖాన్ మాస్ అవతార్ మెయిన్ ఎస్సెట్ అంటున్నారు. అనిరుధ్ అందించిన మ్యూ.జిక్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లు షెకవుతున్నాయంటున్నారు.
మంచి కథ తోపాటు స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ అదిరిపోయాయి.. ఎమోషన్, రొమాన్స్ మరియు మాస్ యాక్షన్ ను కలిసి అట్లీ ఓ మాస్టర్ పీస్‌ను అందించారని, ఓవరాల్ గా సినిమా బావుంది అంటూ షారుఖ్ అభిమానులే కాదు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా జవాన్ పై కామెంట్ చేస్తున్నారు.