Advertisement
Google Ads BL

గతంలో పేరు మార్చుకున్న దేశాలు.. !


ఇండియా పేరు మార్పు అంశం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. మొత్తానికి ఒక్కసారిగా ఇండియా పేరు మార్పు అంశంతో బీజేపీ దేశంలోనే ఓ పెను సంచలనానికి తెరదీసింది. మొత్తానికి ఇండియాను భారత్‌గా మార్చాలని ఎన్డీయే ప్రభుత్వం అయితే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దేశం పేరు మార్చడం అనేది ఇదేం కొత్త కాదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చరిత్రలో ఎన్ని దేశాలు పేర్లు మార్చాయి? అసలు ఎందుకు పేరు మార్చాయి? అనే దానిపై ఓ లుక్కేద్దాం. 

Advertisement
CJ Advs

నిజానికి పలు దేశాలు పేరు మార్చడానికి సరైన కారణం లేకపోలేదు. స్వాతంత్ర్యం, రాజకీయం, సాంస్కృతిక, సామాజిక అంశాల ప్రభావంతో తమ దేశ పేరును మార్చుకున్నాయి. కానీ మనకు ఇండియా పేరు మార్చడానికి సరైన కారణమంటూ ఏమీ లేదు. ఇదంతా పక్కనబెడితే ఏడు దేశాలు తమ దేశ పేరును మార్చుకున్నాయి. అవేంటో చూద్దాం.

పేరు మార్చుకున్న దేశాలు :-

సియామ్ టు థాయ్ లాండ్: 1939లో సియామ్ పేరును థాయిలాండ్ గా మార్చారు. థాయిలాండ్ అంటే స్వేచ్ఛా భూమి. 

ఈస్ట్ పాకిస్తాన్ టు బంగ్లాదేశ్: 1971లో జరిగిన యుద్ధంలో గెలిచిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ వేరు పడింది. ఆ తరువాత ఈస్ట్ పాకిస్తాన్ తన పేరును బంగ్లాదేశ్‌గా ప్రకటించుకుంది. 

సిలోన్ టు శ్రీలంక: 1972లో సిలోన్ ద్వీప పేరును శ్రీలంకగా మార్చారు. శ్రీలంక అంటే సింహాళీ భాషలో ప్రకాశవంతమైన భూమి అని అర్థం 

బర్మా టు మయన్మార్: పాలక మిలిటరీ జుంటా బర్మా దేశం పేరును మయన్మార్‌గా మార్చేశారు. ఇది 1989లో జరిగింది.

చెకోస్లోవాకియా టు చెక్ రిపబ్లిక్ అండ్ స్లోవేకియా: 1993లో చెకోస్లోవాకియా పేరును చెక్ రిపబ్లిక్ అండ్ స్లోవేకియాగా మార్చడంతో  అది కాస్తా.. చెక్ రిపబ్లిక్, స్లోవేకియా అంటూ రెండు దేశాలుగా విడిపోయాయి. శాంతియుత విభజన కమ్యూనిస్ట్ పాలనను అనుకరించింది.

జైర్ టు ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో: 1997లో జైర్ దేశం పేరును ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోగా మార్చారు. అనేక రాజకీయ తిరుగుబాట్లు, వివాదాల తర్వాత ఈ పేరు మార్పు జరిగింది. 

రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా టు నార్త్ మాసిడోనియా: 2019లో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పేరును నార్త్ మాసిడోనియాగా మార్చడం జరిగింది.

Countries that changed their names in the past..:

Countries that changed their names in the past.. Why..!?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs