Advertisement
Google Ads BL

MSMP యుఎస్ ప్రీమియర్స్ టాక్


లాంగ్ గ్యాప్ తో అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అనుష్క ప్రమోషన్స్ పరంగా ప్రేక్షకుల ముందుకు రాకపోయినా.. ఫోన్ ఇంటర్వూస్ తో సినిమాపై క్రేజ్ క్రియేట్ చేసింది. అలాగే నవీన్ పొలిశెట్టి సింగిల్ హ్యాండ్ తో ఈ సినిమా ప్రమోషన్స్ ని చక్కబెట్టేసి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ కూడా నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ లో బిజీగా కనిపించాడు. మెగాస్టార్ చిరు పాజిటివ్ రివ్యూ తో నేడు సెప్టెంబర్ 7 కృష్ణాష్టమి రోజున ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం యుఎస్ ప్రీమియర్స్ ని పూర్తి చేసుకుంది. మరి ఓవర్సీస్ ఆడియన్స్ టాక్ ఎలా ఉందో చూసేద్దాం.. 

Advertisement
CJ Advs

సినిమా మొదలు కాగానే.. ఫస్ట్ 15 మినిట్స్ స్లో గా ఉన్నప్పటికీ నవీన్ పోలిశెట్టి ఎంట్రీతో పుంజుకుంది. ఫస్ట్ హాఫ్ ఎంటెర్టైనెర్ గా ముగిసింది అని ఓ నెటిజెన్ కామెంట్ చెయ్యగా .. సెకండ్ హాఫ్ లో ఫన్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ తో హెవీగా అనిపిస్తుంది. అనుష్క, నవీన్ పెరఫార్మెన్స్ మాత్రం ఆడియన్స్ ని కూర్చోబెట్టేస్తుంది అంటూ మరో ఆడియెన్ కామెంట్ చేసాడు. నవీన్ పోలిశెట్టి కామెడీకి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. 

వెరీ నైస్ మూవీ, చాలా బాగుంది, ఎమోషనల్ తో కూడిన క్లీన్ కామెడీ చిత్రం. అనుష్క ఎప్పటికి రాణినే అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా డీసెంట్ ఫన్ రైడ్ అంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. ఆ విధంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..  పూర్తి వివరాలతో మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి సినీజోష్ రివ్యూ మరికాసేపట్లో.. 

Miss Shetty Mr. Polishetty Overseas Talk :

Miss Shetty Mr. Polishetty Overseas Public Talk 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs