గత మూడు సీజన్స్ నుండి బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ప్రేక్షకులకి మొహం మొత్తేసింది. అదే గొడవలు, అదే నామినేషన్స్, అదే ట్రేజడి, అదే టాస్క్ లు ఇలా అవన్నీ చూస్తే బోర్ కొట్టేశాయి. అయినా నార్త్ లో బిగ్ బాస్ పాపులర్ అయినట్టుగా ఇక్కడ సౌత్ లో అంతగా బిగ్ బాస్ పాపులర్ అవ్వలేదనే చెప్పాలి. మొదటి రెండు మూడు సీజన్స్ బాగానే నడిచినా తర్వాత 4, 5, 6 సీజన్స్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ సీజన్ 7 పై ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించకపోయినా.. హోస్ట్ నాగార్జున గారు ఉల్టా పుల్టా అంటూ కొత్తగా ఉండబోతుంది అని అందరిలో ఆసక్తి క్రియేట్ చేసారు.
ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 7 ఓపెనింగ్ కార్యక్రమం గ్రాండ్ గానే జరిగింది. ఇక సోమవారం అసలు డ్రామా హౌస్ లో మొదలైంది. ఎప్పటిలాగే మొదటి రోజే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్. ఇంకేముంది.. ఏడుపులు, గొడవలు మంగళవారం రాత్రి ఎపిసోడ్ వరకు కొనసాగింది. కార్తీక దీపంలో విలన్ గా భయపెట్టిన మోనిత ఉరఫ్ శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో చేసే గొడవ, గోల, ఏడుపు చూడలేకపోయారు. మెలో డ్రామాలా ఆమె చేసేది చూస్తే మనకే పిచ్చెక్కుతుంది.
ఈ సీజన్ స్టార్ట్ అయిన రెండు రోజులకే ఇలా బోర్ కొడితే ఇంకెలా.. ప్రేక్షకులు ఏదో కొత్తగా కోరుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళకి కావల్సిన కొత్తదనం అందించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో.. వీకెండ్ నాగార్జున ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో ముందుముందు తెలుస్తుంది. ప్రస్తుతమైతే.. రెండు రోజులకే బిగ్ బాస్ ని చూస్తే బోర్ కొట్టింది బాసు అని బుల్లితెర ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.