Advertisement
Google Ads BL

ఇండియా పేరు మార్చడం అంత ఈజీనా..?


మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు ఇది దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క అంశంపై దేశం రెండు వర్గాలుగా విడిపోయింది. దీనికి కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇండియాతో పాటు మన దేశానికి భారత్ అని.. హిందూస్తాన్ అని పేర్లున్నాయి. అయితే ఇండియా పేరు విషయానికి సంబంధించిన వివాదం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు.. 2020లో కూడా పేరు మార్పులపై సుప్రీంలో పిల్ దాఖలైంది. ఇండియా పేరు బ్రిటీష్ కొలోనియల్ కాలనీకి చెందినదని ప్రధాన అభియోగం. 

Advertisement
CJ Advs

ఇండియా అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించి భారత్ అనే పదాన్ని వాడాలని పిల్‌లో పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని కోర్టు కొట్టివేసింది. ఇండియా, భారత్‌లలో ఎవరికి ఇష్టమైన విధంగా వారు పిలుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. ఉత్తరాన మంచు పర్వతాలకు, దక్షిణాన సముద్రానికి మధ్య ఉన్న భూభాగాన్ని భారత్‌గా పిలవడం జరుగుతోంది. అలాగే ఇండస్ వ్యాలీ నుంచి పుట్టిన పదం హిందూ. దీనిని నుంచే ఇండస్.. ఇండియోస్ ఉద్భవించి కాలక్రమంలో అవి కాస్తా ఇండియాగా మారిపోయింది. కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే బ్రిటీష్ వాళ్లు పిలిచారు కాబ్టటి ఇది ఇండియా అనుకుంటే అది తప్పులో కాలేసినట్టే.

ఎన్నికలు వస్తున్నాయంటే బీజేపీకి ఏదో ఒక విధమైన రచ్చ లేపడం అలవాటే. అది ముఖ్యంగా మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఇండియా పేరుపై రచ్చ. అయితే ఇండియా పేరును భారత్‌గా మార్చాలంటే.. తొలుత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. దీనికోసం ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాలి. ఇలా పేరు మార్పునకు మూడింట రెండొంతుల మెజారిటీ అంటే 66 శాతం సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వం ఈ మెజారిటీ సాధించగలిగితే ఇండియా పేరు తొలగించి, భారత్ పేరును ఖరారు చేయగలుగుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. అసలు ఎందుకీ సమావేశాలన్నది తెలియలేదు కానీ పేరు మార్పు కోసమే అని మాత్రం ప్రచారం జరుగుతోంది.

Is it so easy to change the name of India?:

Is India to be renamed Bharat?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs