Advertisement
Google Ads BL

పరిణీతి-రాఘవ్ వెడ్డింగ్ డేట్ రివీల్డ్


ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా- హీరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లికి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది మే నెలలో రాఘవ్-పరిణీతి లు ఎంగేజ్మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వీరు వివాహానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. 

Advertisement
CJ Advs

సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ లోని లీలా ప్యాలెస్‌ లో వీరి వివాహం జరగనుంది. పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకకు సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు ఇలా 200 మంది మాత్రమే హాజరవుతారు. పెళ్లికి వచ్చే అతిథులు, వీఐపీల కోసం ఉదయ్‌ పూర్‌లో విలాసవంతమైన హోటళ్లను బుక్‌ చేశారు. హల్దీ, మెహందీ, సంగీత్‌ సహా వివాహాది కార్యక్రమాలు సెప్టెంబర్ 20 తర్వాత ప్రారంభమవుతాయి. పెళ్లి తర్వాత హర్యానాలోని గురుగ్రామ్‌లో పరిణీతి-రాఘవ్ చద్దాలు గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు అని సమాచారం.

రాఘవ్-పరినీతిల పరిణయానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవాకాశం ఉంది. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు, పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.

Raghav-Parineeti wedding on this day:

Raghav Chadha-Parineeti Wedding Date Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs