మెగా ఫ్యామిలోకి మెగా వారసురాలిగా క్లింకార వచ్చేసింది. రామ్ చరణ్-ఉపాసనలు జూన్ 20 న పండంటి ఆడపిల్లకి జన్మనివ్వగా.. మెగాస్టార్ మనవరాలిని చూసుకుని మురిసిపోయారు. ఆ పాపకి క్లింకారాగా నామకరణం చేసారు. అయితే ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు.. చివరి మంత్స్ వరకు అంటే దాదాపు తొమ్మిదో నెలవరకు ఆరోగ్యంగా భర్త చరణ్ తో కలిసి వెకేషన్స్ అంటూ విదేశీ ప్రయాణాలు చేసింది.
బేబీ పుట్టాక కూడా హెల్దీగానే కనిపించిన ఉపాసన నెల తిరక్కుండానే పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించింది. ప్రస్తుతం పాపతో మూడు నెలలుగా బిజీగా గడిపిన ఉపాసన-చరణ్ దంపతులు పాప పుట్టాక మొదటి వెకేషన్ కి వెళ్లారు. నిన్న మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. వాళ్లతో పాప క్లినికార మాత్రం కనిపించలేదు. అటు రామ్ చరణ్ కూడా శంకర్ గేమ్ చెంజర్ నుండి కాస్త బ్రేక్ దొరకడంతో భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతమైతే రామ్ చరణ్-ఉపాసనల ఎయిర్ పోర్ట్ లుక్ వైరల్ అయ్యింది.