Advertisement
Google Ads BL

VD ఖుషీకి ఫేమస్ లవర్ కౌంటర్


పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వరసగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన విజయ్ దేవరకొండ అదే వరసలో డిజాస్టర్స్ నీ ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఖుషి రూపంలో తనకొక రిలీఫ్ వచ్చింది అనుకుంటే ఇప్పుడది కూడా అంతంత మాత్రం సంతృప్తిని అందిస్తోంది. అంతకుమించి మరో కొత్త వివాదాన్ని రాజేస్తోంది.  

Advertisement
CJ Advs

ఖుషి సక్సెస్ టూర్ లో ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా ఆ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం వైజాగ్ వెళ్ళాడు. అక్కడ ఖుషి ఈవెంట్ లో మాట్లాడిన విజయ్ దేవరకొండ తన సినిమా ఖుషి హిట్ అయినా కూడా.. తన సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా కొంతమంది డబ్బులిచ్చి నెగెటివ్ ప్రచారం చేయించారు. నా అభిమానుల వల్లే నా సినిమా ఆడుతుంది.. ఎవరికి ఏ అవసరం ఉన్నా వాళ్ళని ఆదుకుంటాను.. ఖుషికి వచ్చిన డబ్బుల్లో నేను ఓ కోటి రూపాయలు ఫాన్స్ కి సహాయం చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక లక్ష ఇస్తాను, మీ ప్రేమ, మీ ఆదరణే నా సినిమాని బ్రతికించింది అంటూ ఏదో ఫ్లోలో తెగ మట్లాడేసాడు. 

విజయ్ దేవరకొండ ఆ ప్రకటన చేసినప్పటినుండి అభినులు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మరింత చెలరేగిపోతున్నారు. కానీ విజయ్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన అభిషేక్ పిక్షర్స్ వారు మాత్రం సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకి అతి పెద్ద కౌంటర్ వేశారు. అది Dear @TheDeverakonda We lost 8 crs in the distribution of #WorldFamousLover, but no one responded over it!!

Now as you are donating 1CR to the families with your big heart, Kindly requesting & Hoping for you to save us and our Exhibitors & Distributors  families also 🤗❤️

Thank you

Yours, 

Abhishek Pictures.

#humanity #Love #empathy

నీ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ని కొని మేము 8 కోట్లు నష్టపోయాము. అప్పుడు ఎవరూ ఇలా స్పందించలేదు. మీరు కోటి రూపాయలు అభిమానుల కోసం విరాళం ప్రకటించారు. మీది పెద్ద మనసు. మిమ్మల్ని దయ చేసి కోరుకునేదేమిటంటే.. వరల్డ్ ఫేమస్ లవర్ కొన్న ఎగ్జిబ్యూటర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా పెద్ద మనసుతో సహాయం చెయ్యాలని అభ్యర్దిస్తున్నాము.. అంటూ అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ నుండి పడిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 

Abhishek Pictures counter to Vijay Devarakonda:

Abhishek Pictures counter tweet on Vijay Devarakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs