దేవర గర్ల్ ఫ్రెండ్ జాన్వీ కపూర్ ఎప్పుడు ఎన్టీఆర్ తో కలిసి రొమాంటిక్ స్టిల్ ఇస్తుందో తెలియదు కానీ.. దేవర మూవీలో జాన్వీ కపూర్ నటిస్తుంది అనగానే తెలుగు వాళ్ళందరి అటెన్షన్ జాన్విపై పడింది. అంతకుముందు మహేష్ తో నటిస్తుంది, విజయ్ దేవరకొండ తో జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ అంటూ ప్రచారం జరిగినా ఆమె మాత్రం ఎన్టీఆర్ తోనే తెలుగులోకి దిగుతుంది. అప్పటినుండి జాన్వీ కపూర్ ఏం చేసినా ఆటోమాటిక్ గా అందరి చూపు ఆమెపై పడుతుంది.
ఇక రీసెంట్ గా ఓ బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతున్న జాన్వీ కపూర్ తరచూ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనంలో పాల్గొంటుంది. తాజాగా జాన్వీ కపూర్ తన ఓల్డ్ బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది. తాను చిన్నవయసులోనే ప్రేమలో పడ్డాను అని.. కానీ పరిణీతి లేని ప్రేమ చాలా త్వరగా ముగిసిపోయింది అంటూ తన మొదటి పేమ ఎలా బ్రేకప్ అయ్యిందో చెప్పుకొచ్చింది. మెచ్యూరిటీ లేని ప్రేమ వల్ల ఇద్దరం అయోమయంలో పడిపోయాము.
నిజాయితీ లేని ప్రేమ.. అబద్దమనే దారిలో ప్రేమ, రిలేషన్ నడిచింది. అదే టైమ్ లో మా అమ్మ, నాన్న ఇద్దరూ ముందు స్టడీస్ మీద కాన్సంట్రేట్ చెయ్యి అని హెచ్చరించారు. వారి మాటలు ఫాలో అయితే ఫ్యూచర్ బావుంటుంది అని నా ప్రేమని పక్కనపెట్టాను. అలా నా మొదటి ప్రేమకి బ్రేకప్ చెప్పాను అంటూ దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ తన మొదటి ప్రేమపై, దాని బ్రేకప్ పై పెదవి విప్పింది.