పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది అంటూ నిర్మాత ఏఎం రత్నం రీసెంట్ గా ఓ సినిమా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు. అసలు హరి హర వీరమల్లు ఆగిపోయింది అనే టాక్ నడుస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఓ పోస్టర్ రావడం, ఆ తర్వాత ఏఎం రత్నం హరి హర వీరమల్లు రెండు భాగాలు అని చెప్పడం ఇవన్నీ అభిమానుల్లో ఆశలు రేపింది.
అయితే హరి హర వీరమల్లు రెండు భాగాలూ అని కన్ ఫమ్ చేసిన కాసేపటికే.. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కూడా రెండు భాగాలంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో మొదలైంది. మొదటి పార్ట్ లో పవన్ తక్కువ నిడివితో కనిపించి రెండో పార్ట్ లో మాత్రం ఫుల్ లెంగ్త్ కనిపిస్తాడని సమచారం. దర్శకుడు సుజిత్ కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్న విధానం OG బృందానికి కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుందట. తాజా షెడ్యూల్ తో పవన్ కూడా ఫిదా అయ్యారట.. అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఇస్తున్న న్యూసులతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు.
రీసెంట్ గా పవన్ బర్త్ డే కి OG నుండి వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేవిలా ఉంటే.. ఇది ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతుంది అని మేకర్స్ గ్రాండ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో అమితాబ్, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ లాంటి క్రేజీ స్టార్స్ భాగమవుతున్నారు.