Advertisement
Google Ads BL

MSMPకి తొలి ప్రేక్షకుడిని నేనే: చిరు


నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు రూపొందించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘జాతిరత్నాలు’ సినిమాని మించిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.  

Advertisement
CJ Advs

‘మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి‌లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. 

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ Mahesh Babuని అభినందించాల్సిందే. BTW ఈ చిత్రానికి  తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరితోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు!!! యువీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్, Cast & Crew టీమ్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు.. అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Megastar Chiranjeevi Watches Miss Shettty Mister Polishetty:

Megastar Chiranjeevi Praises on Miss Shettty Mister Polishetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs