Advertisement
Google Ads BL

తిరుపతిలో షారుఖ్ - నయన్


బాలీవుడ్ బాద్షా షారుఖ్ - లేడీ సూపర్ స్టార్ నయనతార కలయికలో అట్లీ తెరకెక్కించిన జవాన్ మూవీ రేపు గురువారం విడుదలకు సిద్దమవుతుంది. ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాలో విపరీతమైన అంచనాలున్న జవాన్ మూవీ ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. జవాన్ విడుదల నేపథ్యంలో షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహాన్ ఖాన్ లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. షారుఖ్ ఫ్యామిలీతో పాటుగా నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ కూడా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు. 

Advertisement
CJ Advs

వారంతా ఈరోజు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతార, విఘ్నేష్ శివన్ తో కలిసి షారుఖ్ ప్రత్యేకంగా సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ముందుగా దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

ఆ తరువాత షారుఖ్ గర్భాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత పండితులు షారుఖ్‌కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల మాఢవీధుల్లో నడిచొస్తున్న షారుఖ్, నయన్ ని చూసిన ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. 

Shah Rukh Khan and Nayanatara at Tirumala :

Shah Rukh Khan and Nayanatara offer prayers in Tirumala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs