Advertisement
Google Ads BL

ప్రియురాలిని పెళ్ళాడిన నటుడు మహేష్


నటుడు మహేష్ విట్టా అంటే తెలియనివారుండరు. నాని కృష్ణార్జున యుద్ధం మూవీతో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో నానికి ఫ్రెండ్ గా కనిపించాడు. తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన మహేష్ విట్టా రాయలసీమ యాసతో ఆకట్టుకున్నాడు. ఇక బుల్లితెర షో బిగ్ బాస్ లో తనదైన శైలిలో ప్రేక్షకులని ఆకర్షించిన మహేష్ విట్టా ఆ షో వేదికగా తనకి ఓ లవర్ వుంది అని చెప్పాడు. 

Advertisement
CJ Advs

తనని శ్రావణి పలుమార్లు రిజెక్ట్ చేసినా తన వెంటపడి తనని కూడా ఆమె ప్రేమించేలా చేసుకున్నాను అంటూ మహేష్ పలుమార్లు పలు సందర్భాల్లో చెప్పాడు. ఆమెతో రెండేళ్ల స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న మహేష్ విట్టా తాజాగా తాన ప్రియురాలు శ్రావణితో ఏడడుగులు నడిచాడు. పెద్దల అంగీకారంతో ఈ వివాహం ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాలులో మహేష్-శ్రావణి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 

మహేష్ విట్టా వివాహానికి బంధువులు అలాగే సినిమా ఇండస్ట్రీ నుండి అతని స్నేహితులు పలువురు హాజరయ్యారు. ప్రస్తుతం మహేష్ విట్టా పెళ్లి ఫొటోస్ వైరల్ అయ్యాయి. 

Actor Mahesh Vitta Married his girlfriend:

Mahesh Vitta of Bigg Boss fame married with girlfriend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs