Advertisement
Google Ads BL

హరీష్ శంకర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 5 నుంచి మళ్లీ మొదలవ్వబోతున్నట్లుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలియజేశారు. ఈ షెడ్యూల్‌లో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరించబోతున్నట్లుగా తెలుపుతూ.. షేర్ చేసిన పిక్ చూస్తే అంతా భయపడిపోవాల్సిందే. 

Advertisement
CJ Advs

ఎందుకంటే.. ఈ పిక్‌లో రకరకాల కత్తులతో దర్శకుడు హరీష్ శంకర్ దర్శనమిచ్చారు. హరీష్ శంకర్ నిలబడి ఉండగా.. ఆయన ఎదురుగా ఇన్ని రకాల కత్తులు ఉంటాయా? అనేలా అన్ని రకాల కత్తులను ఒక చోట చేర్చి ఉంచారు. ఈ పిక్ చూస్తుంటే.. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను హరీష్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మైత్రీ వారు చేసిన ఈ పోస్ట్‌కు రీ ట్వీట్ చేసి.. మనల్ని ఎవడ్రా ఆపేది? అంటూ హరీష్ శంకర్ కూడా.. సెప్టెంబర్ 5న ఎటువంటి ఎపిసోడ్ చిత్రీకరణ జరగబోతుందనేది క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ఈ పోస్ట్‌కి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఊచకోత మొదలవ్వబోతుంది.. హరీష్ అన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడ్రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Ustaad Bhagat Singh Latest Update Creates Sensation:

Mythri Movie Makers Update on Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs