Advertisement
Google Ads BL

హరిహర వీరమల్లు 1 రిలీజ్ ఎప్పుడంటే..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తున్నా కానీ.. ఆయన అభిమానుల కళ్లన్నీ క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాపైనే ఉన్నాయి. తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో చేయడంతో పాటు.. క్రిష్ దర్శకత్వ ప్రతిభ కూడా ఈ సినిమా కోసం వేచి చూసేలా చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత సజావుగా అయితే సాగడం లేదు. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోయిందనేలా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

అదేం లేదు అనేలా.. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఓ పోస్టర్ వదిలి.. సినిమా లైన్‌లోనే ఉన్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చేసింది. నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లుకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ చిత్ర మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో హరిహర వీరమల్లు విడుదలకు సంబంధించిన వివరాలను కూడా మీడియాకు తెలియజేశారు. 

హరిహర వీరమల్లు సినిమా పిరియాడికల్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చాలా పెద్ద సినిమా. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్‌ వర్క్‌ చాలా చేయాల్సి ఉంటుంది. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌గారు పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నారు. అందుకే త్వరగా పూర్తయ్యే సినిమాలను ఆయన మధ్యమధ్యలో చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికి పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం ఎన్నికల కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత ఏఎం రత్నం చెప్పుకొచ్చారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఏఎం రత్నం కన్ఫర్మ్ చేశారు.

Producer AM Rathnam Clarity about HariHara VeeraMallu Release:

There will be a sequel to Hari Hara Veera Mallu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs