షెల్ కంపెనీల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 118 కోట్ల రూపాయల ముడుపులు అందాయని, ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమవడంతో ఒక్కసారిగా ఏపీలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని వైసీపీ అయితే చాలా సీరియస్‌గా తీసుకుని మరీ విపక్షాన్ని పొలిటికల్‌గా దెబ్బకొట్టాలని తెగ ట్రై చేస్తోంది. అంతేకాదు.. చంద్రబాబు కానీ ఆ పార్టీ నేతలెవరూ ఈ విషయంపై స్పందించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముడుపుల వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను ఒకటే చెబుతున్నా.. ఎన్నిసార్లు ఎంక్వయిరీ వేసినా ఏం పీకలేకపోయారు.. టీడీపీ నిప్పులాంటి పార్టీ’’ అని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. కేవలం ఎలక్షన్ల లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తను స్పందించడం లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇష్టానుసారంగా మాట్లాడి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. అంతేకాదు.. వైసీపీ నేతలకు ఇన్‌డైరెక్ట్‌గా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నీతి నిజాయితీగా ఉన్న పార్టీ టీడీపీ అని, ప్రజల కోసం ఒక పద్ధతిగా పనిచేసిన పార్టీ తమదని అన్నారు.
తనను ఏం పీకలేరని చంద్రబాబు ఎదురు దాడికి దిగారు. అసలు వైసీపీ చేస్తున్నదంతా అసత్య ప్రచారం అని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ పార్టీ అధినేత మింగేసిన రూ.43 వేల కోట్ల వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలా డ్రామాలాడుతున్నారని విమర్శిస్తున్నారు. అసలు ఏమీ లేని వ్యవహారంపై ఏం మాట్లాడాలని ప్రశ్నిస్తున్నారు. తమను ఏదో ఇరుకున పెట్టేందుకు పెయిడ్ సర్వేలు మాత్రమే కాకుండా పెయిడ్ ఆర్టికల్స్ కూడా రాయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి టీడీపీ అధినేతపై గత ప్రభుత్వాలు సైతం ఏవేవో ఆరోపణలు చేశాయి. కానీ ఎప్పుడైనా చంద్రబాబు క్లీన్ చిట్‌తోనే బయటకు వచ్చారు.