Advertisement
Google Ads BL

ఆ యాక్సిడెంట్ తర్వాత బన్నీలో మార్పు


అల్లు అర్జున్ చూడటానికి మాసివ్‌గా కనిపించినా.. ఆయన మనస్తత్వం చాలా సున్నితమైనది. అందుకు సాక్ష్యం ఈ సంఘటనే. ఆయన లైఫ్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్.. అల్లు అర్జున్‌ని పూర్తిగా మార్చేసిందట. ఈ విషయం తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ యాక్సిడెంట్ తర్వాత డ్రైవింగ్ విషయంలో ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటానని, అవసరానికి మించి వేగంగా ఎప్పుడూ వెళ్లనని బన్నీ చెప్పుకొచ్చారు. తన లైఫ్‌లో జరిగిన ఆ సంఘటన తర్వాత డ్రైవింగ్ విషయంలో ఎప్పుడూ పొరపాటు చేయలేదని.. చాలా పద్ధతిగా అల్లు అర్జున్ తెలిపాడు. ఇంతకీ ఆ సంఘటన ఏమిటంటే..

Advertisement
CJ Advs

డ్రైవింగ్ సీటులో కూర్చున్న ప్రతిసారి బన్నీకి ఓ సంఘటన గుర్తు వస్తుందట. అల్లు అర్జున్‌కి పందొమ్మిదేళ్ళ వయసులో ఓ ఫ్రెండ్‌తో హోటల్‌కి వెళితే అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. దీంతో కోపంగా లేచి కారులో వెళ్లిపోతున్న ఆమెను ఆపే ప్రయత్నంలో.. వేగంగా వెళ్లి ముందున్న కారుని ఢీకొట్టాడట. వెంటనే కారు ఆపి.. ఢీకొట్టిన కారులోని వాళ్ళకి ఏమి అవ్వలేదని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని సారీ చెప్పాడట. అయితే వర్షం పడుతున్న ఆ సమయంలో కారు వెనక సీట్లో ఓ నిండు గర్భిణి కూర్చుని ఉందనీ... ఆమె తనని ఒక్క మాట కూడా అనకపోయినప్పటికీ.. ఆమె కళ్ళల్లో కనిపించిన కోపం మాత్రం తనకి ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పుకొచ్చాడు.

అంతే ఆ రోజు జరిగిన ఆ యాక్సిడెంట్ బన్నీకి పెద్ద గుణపాఠం నేర్పిందట. ఆ రోజు నుంచి డ్రైవింగ్‌లో పొరపాట్లు చేయడం కానీ.. రాంగ్ రూట్‌లో వెళ్ళడంగానీ చేయలేదట. అప్పటి నుండి జాగ్రత్తగా డ్రైవ్ చేయడాన్ని అలవాటుగా చేసుకున్నాడట అల్లు అర్జున్. మన బాధ్యతల్ని మనం నిర్వర్తించడం కూడా దేశభక్తేనని, మార్పు మనతోనే మొదలవ్వాలనీ చెబుతూ.. ఆ తర్వాత ఆయన ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. 

Big Change in Bunny after That Accident:

Allu Arjun Life Change Incident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs