Advertisement
Google Ads BL

షర్మిలా.. ఈ 10 ప్రశ్నలకు జవాబు చెప్పమ్మా!


నాన్న గారి ఆశయం.. నాన్న గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు లేదు.. రాజన్న పాలన తేవడానికే తాను వైఎస్సార్టీపీ పెట్టాను.. ఇటు అధికార బీఆర్ఎస్‌తో అటు కాంగ్రెస్, బీజేపీతో కొట్లాడుతాను.. ఇవీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా చెప్పే మాటలు. అయితే అబ్బే వైఎస్సార్టీపీ అంత సీన్ లేదని.. ఇది కూడా పిల్ల కాంగ్రెస్సేనని అప్పట్లో చాలా మందే విమర్శించారు. సీన్ కట్ చేస్తే ఆ మాటలన్నీ అక్షరాలా నిజమవ్వబోతున్నాయ్. రేపో, మాపో కాంగ్రెస్ పార్టీలో షర్మిల తన వైఎస్సార్టీపీని విలీనం చేసేయబోతున్నారు. అయితే.. వైఎస్సార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ వీరాభిమానులు, అనుచరులు మాత్రం తీవ్ర అసహనం, ఆవేశం, ఆక్రోశంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు వీరాభిమానులు. ట్విట్టర్‌లో ఒక వీరాభిమాని సంధించిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement
CJ Advs

మీ పార్టీ మీ ఇష్టమే మేడం!

వైఎస్సార్టీపీ మీ పార్టీ మీ ఇష్టం .. కాంగ్రెస్‌తో కాకపోతే తెలుగుదేశంతో కలుపుకోవచ్చు .. ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ ఒక వైఎస్సార్ వీరాభిమానిగా ఈ నిర్ణయాన్ని స్వాగతించలేము .. ఇక మీ ఇష్టం వచ్చినట్లు రాజకీయం చేసుకోవచ్చు .. కానీ మా ఆవేదన ఇది.

01:- YSR  మీద అంత గౌరవం ఉంటే 2011 నుంచి 2017 వరకు మళ్ళీ 2019 నుంచి 2022 వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయంతి , వర్ధంతిలు ఎందుకు జరపలేదు..!?

02: - తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. ఆంధ్రజ్యోతికి లీక్ ఇచ్చి .. ఆంధ్రజ్యోతి స్టూడియోకి వెళ్ళి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంటూ కూర్చొన్నారు..  అయినా అభిమానులు కట్టలు తెంచుకున్న బాధని ఎందుకు దిగమింగారు..?

03:- బీజేపీతో విలీనం లేదా పొత్తు దిశగా అనిల్ కుమార్ ప్రయత్నాలు సాగాయి .. కుదరలేదు.. నిజమా కాదా..!?  

04 :- ఏ కాంగ్రెస్‌ను అయితే విభేదించి బయటకి వచ్చారో ఆ కాంగ్రెస్‌తో కలిసింది.. తప్పులేదు.. కానీ ఎంచుకున్న విధానం మీరు ఇచ్చిన సమాధానం ఏమిటి..? ఎందుకింతలా తయారయ్యారు..?

05 :- FIRలో పెద్దాయన వైఎస్సార్ పేరు అలానే పెడతారు రాజీవ్ గాంధీ పేరు కూడా అలానే పెట్టారు అన్నారు.. సరే నిజం అయ్యి ఉండవచ్చు.. కానీ ఈ కేసులకు మూల కారణం, నిర్ణయం సోనియాకు తెలియకుండా జరిగిందా ? అప్పుడు సంతకం లేని ఉత్తరం శంకరరావు ఇస్తే దాని మీద కూడా ఎందుకు ఏమీ మాట్లాడకుండా మౌనం పాటించారు..?

06  :- అప్పటి కేంద్రమంత్రి సాయిప్రతాప్ ఇదే ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నిజమే కదా .. ఆ దీశగానే కేసులు వేశారు కదా ..?

07 :- 16 నెలల పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కడైనా తపస్సు చేసుకుంటా ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నారా..!?. సోనియాకు తెలియకుండానే 12 మందికి కేంద్ర మంత్రుల పదవులు ఉమ్మడి ఆంధ్రాలో ఇచ్చారా ? వారిని జగన్ మీదకి ఎగదోసారా.. లేదా..!?

08  :- విజయమ్మ మీద వైఎస్ వివేకానంద రెడ్డిని పోటీకి పెట్టింది .. దీనికి సమాధానం ఏమిటి ? ఎవరి ప్రోద్బలంతో ఇలా జరిగింది..!?

09 :- 2011లో జరిగిన కడప ఉపఎన్నికల సమయంలో చేసిన రచ్చ మరచిపోయారా..!?

10 :- 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవాలి అని కాంగ్రెస్ టీడీపీకి చేసిన సహాయం మరిచరా..!?

చెప్పండి షర్మిలమ్మా..!

ఈ రోజున జరుగుతున్న రాజకీయం ఏమిటి.. ? ఒక వేళ నిజంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నిజంగా పెద్దాయన మీద అంత గౌరవం ఉంటే ఎలాంటి కండీషన్స్ లేకుండా పార్టీ ఎలా విలీనం చేశారు..? కనీసం పాలేరు సీటు కూడా ఇస్తారా లేదా అనేది కూడా కన్ఫామ్ లేకుండా వార్తలు వస్తున్నాయి.. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘ఒకరిని ఇబ్బంది పెట్టాలి.. ఓడించాలి’ అని రాజకీయం చేస్తే నిలవదన్న విషయం బహుశా షర్మిలకు తెలియకపోవచ్చేమో. సోనియా గాంధీతో సమావేశం అనంతరం బయటికొస్తూ సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలయింది అని కాదు చెప్పాల్సింది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. లేదా ప్రభుత్వంలోకి వస్తుంది అని చెప్పాల్సింది. కాంగ్రెస్ లో మిమ్మలని ఒక పావుగా వాడుకోవడానికి కొంతమంది, మిమ్మలను అనగదొక్కడానికి ఇంకొక వర్గం గట్టిగా ప్రయత్నం చేస్తుందన్న విషయం తెలుసుకుంటే మంచిది. ఏదేమైనా కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది కాస్త జాగ్రత్త షర్మిల..!

YS Sharmila Answer these 10 Questions:

10 Questions to YS Sharmila
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs