Advertisement
Google Ads BL

కేసీఆర్ మైండ్‌బ్లాంక్ చేసే రేవంత్ స్కెచ్!


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజురోజుకూ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయ్!. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుండగా.. ఈసారి చావో రేవో తేల్చుకోవాలని, ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్.. ఎత్తుగడలేస్తున్నాయి. ఇక బీజేపీలో అయితే మునుపటిలా పరిస్థితుల్లేవ్. ఒకప్పుడు అదే.. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్‌‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి తీసుకెళ్లారు. ఆ తర్వాత అధ్యక్షుడి మార్పు, పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పులు.. కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాజయంతో కమలం ఒక్కసారి వాడిపోయింది. మళ్లీ ఎప్పుడు వికసిస్తుందో కూడా తెలియని పరిస్థితి. సరిగ్గా ఇదే.. కన్నడ నాట ఎగిరిన కాంగ్రెస్ జెండాతోనే తెలంగాణలో పార్టీకి ఎనలేని బలం, రెట్టింపు ఉత్సాహం వచ్చినట్లయ్యింది. దీంతో తదుపరి టార్గెట్ తెలంగాణగా వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్.

Advertisement
CJ Advs

ఇదీ అసలు కథ..!

కేసీఆర్ ఎప్పుడైతే 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారో.. నాటి నుంచే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో.. ఆచితూచి అడుగులేస్తూ వస్తున్నారు. దమ్ముంటే సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ తిన్నగా తన ట్రాప్‌లోనికి తెచ్చుకున్నారు రేవంత్. ఆ తర్వాత ఈ సవాల్‌ను స్వీకరించిన కేసీఆర్ దాదాపు సిట్టింగ్‌లకే టికెట్ ఇచ్చారు. అయితే తాను మాత్రం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. గులాబీ బాస్ మైండ్ బ్లాంక్ అయ్యేలా రేవంత్ రెడ్డి ఓ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. గత ఎన్నికల్లో అనగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కేసిన ఎమ్మెల్యేల్లో కొందరికి టికెట్లు ఇవ్వడంతో పాటు.. మరికొందరికి హ్యాండిచ్చేశారు గులాబీ బాస్. అయితే.. ఆయా స్థానాల్లో ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు ఎలాగైనా సరే గెలిచేవాళ్లనే బరిలోకి దింపాలని వ్యూహాత్మక ఆలోచన రేవంత్ చేసినట్లు తెలిసింది. ఇందులో మహేశ్వరం, పాలేరు, తాండూరు, ఎల్బీనగర్, కొత్తగూడెం, భూపాలపల్లి.. ఇలా పలు నియోజకవర్గాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈసారి ఎట్టిపరిస్థితుల్లో ఆ 12 మంది ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని ఇందుకు కొన్ని వ్యూహరచనలు చేశారట రేవంత్.

 

పెద్ద తలకాయలే!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్ నుంచి ఎలాగైతే ఎమ్మెల్యేలను లాక్కున్నారో.. ఆయా స్థానాల్లో మాజీలు, ముఖ్యనేతలు, టికెట్లు దక్కించుకోని వారిని తమ పార్టీలోకి చేర్చుకుని వారితోనే తమ పార్టీని కాదన్న వారిని ఓడించాలన్నది వ్యూహమట. అందుకే గత కొన్నిరోజులుగా రేవంత్ రెడ్డి ఇదే పనిలో నిమగ్నమైనట్లు తెలియవచ్చింది. టార్గెట్ ఖమ్మంలో భాగంగా ఇప్పటికే మాజీ ఎంపీ, కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం.. ఇప్పుడిక అదే జిల్లాకు చెందిన రాజకీయ కురువృద్ధుడు, బీఆర్ఎస్ ముఖ్యనేత తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం చేస్తున్నారట. దాదాపు తుమ్మల ఒక వారంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డిని ఓడించడానికి తీగల కృష్ణారెడ్డిని.. ఇలా మొత్తం 12 స్థానాల్లో ఎలాగైనా సరే గట్టి అభ్యర్థులను నిలబెట్టి.. 12 స్థానాలకుగాను 12 గెలిచి అంటే క్లీన్ స్వీప్ అన్నమాట. ఇలా చేస్తే.. పార్టీ మారిన వారికి ఒక గుణపాఠం అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్‌లు చేస్తోందట. నిజంగా ఇది కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే వ్యూహమే అని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా ఫలితాలు ఎలా ఉంటాయో.. రేవంత్ వ్యూహం ఏ మాత్రం పనిచేస్తుందో వేచి చూడాలి మరి.

Revanth Reddy Sketch on KCR:

Revanth Reddy Plan Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs